Telugu News: రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చారని జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్ (Jada Sravan) ధ్వజమెత్తారు. టిటిడి పాలకమండలి సభ్యులుగా జంబో టీం ను ప్రకటించారని, గత ప్రభుత్వం పై విమర్శలు చేసిన టిడిపి ఇప్పుడు ప్రకటించిన లిస్ట్ ఏంటో చెప్పాలన్నారు. ఇవాళ ఆయన మీడియాలో మాట్లాడారు. (Telugu News)
‘‘మంత్రి పదవులు దక్కని వారికి, ఎమ్మేల్యే టికెట్స్ ఇవ్వలేకపోనివారికి పాలకమండలి సభ్యులుగా ప్రకటించారు. 24 మంది సభ్యుల్లో అధ్యాత్మిక ఉన్నవాళ్లు, టిటిడి ప్రాముఖ్యతను కాపాడే వాళ్లు ఎవరున్నారో చంద్రబాబు, పవన్, బిజెపి చెప్పాలి. పార్టీకి సహకారంగా వార్తలు వేసిన టివి5 ఎండికి చైర్మన్ పదవి కట్టబెట్టారు. చైర్మన్ పై చాలా ఆరోపణులు ఉన్నాయి..సాక్ష్యాలు లేవు కాబట్టి నేను మాట్లాడడం లేదు. క్రిమినల్ కేసులు ఉన్నవారిని ట్రస్ట్ బోర్డు మెంబర్స్ గా నియమించారు.
ఎమ్మెల్యేలు ప్రశాంతి రెడ్డి, జ్యోతుల నెహ్రులపై ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుపై 23 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రెండు కేసుల్లో శిక్ష కూడా పడిన వ్యక్తి ఎం.ఎస్.రాజు. భూతులు మాట్లాడేవ్యక్తిని పాలకమండలి సభ్యుడిగా నియమిస్తే పవిత్రత ఏవిధంగా కాపాడతారు?
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు క్యారేజ్ లు మోసిన మునికోటేశ్వరరావుని బోర్డుమెంబర్ గా నియమించారు. అతిథిదేశాయ్ తండ్రి కేతన్ దేశాయ్ కోట్ల రూపాయాలు అక్రమంగా కోల్లగొట్టడని మెడికల్ కౌన్సిల్ చెప్పింది. వెంకటేశ్వరస్వామి అలివేలు మంగమ్మపై జోకులు వేసే నర్సిరెడ్డికి బోర్డు మెంబరా? టిడిపి పార్టీ నాయకులతో బోర్డు నింపేశారు. 1987 దేవాదాయ చట్టంకి విరుద్దంగా బోర్డు సభ్యులను నియమించారు. (Telugu News)
24మంది సభ్యుల్లో అధ్యాత్మిక ఉన్నవాళ్లు, టిటిడి ప్రాముఖ్యతను కాపాడే వాళ్లు ఎవరున్నారో చంద్రబాబు, పవన్, బిజెపి చెప్పాలి. ఇది టిటిడి బోర్డు కాదు..టిడిపి బోర్డు. ట్రస్ట్ బోర్డు సభ్యులను మార్చే వరకు చైర్మన్ ని కూడా మార్చే వరకు పోరాటం చేస్తాం. టిటిడి పాలక మండలి లా బోర్డు సభ్యులు లేరు.. టిడిపి బోర్డు లా ఉంది. హైకోర్డులో ప్రజా ప్రయోజన వాజ్యం వేస్తాను. ట్రస్ట్ బోర్డు సభ్యుల నియమకం అంశంలో మరోసారి పునరాలోచించాలి.’’ అని జడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: TTD Board: టీటీడీ బోర్డులో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణుడికీ దక్కని చోటు
TTD Chairman: లోకేష్ మార్క్.. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. ఆర్కే పరిస్థితి?
TTD Big News: టీటీడీ కీలక నిర్ణయాలు.. 15 ఏళ్లలోపు చిన్నారులకు నడక దారిలో రిస్ట్రిక్షన్స్.. బైక్‌లకు రాత్రిపూట నో ఎంట్రీ!
Tirumala: చంద్రబాబు జేబు సంస్థలా టీటీడీ బోర్డు
