HomeAndhra PradeshVizag: రైల్లో అసౌకర్యం.. విశాఖ ప్రయాణికుడికి రూ.30 వేలు చెల్లించాలని ఆదేశం

Vizag: రైల్లో అసౌకర్యం.. విశాఖ ప్రయాణికుడికి రూ.30 వేలు చెల్లించాలని ఆదేశం

Vizag: తిరుపతి నుంచి వైజాగ్‌లోని దువ్వాడకు ప్రయాణంలో అసౌకర్యాన్ని ఎదుర్కొన్న ప్రయాణికుడికి రూ.30,000 పరిహారం ఇవ్వాలని జిల్లా వినియోగదారుల కమిషన్ భారతీయ రైల్వేని ఆదేశించింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురైన 55 ఏళ్ల వ్యక్తికి న్యాయపరమైన ఖర్చులకు అదనంగా రూ.5,000 చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వే (SCR)ని ఆదేశించింది.

రైలు ప్రయాణంలో ఏం జరిగిందంటే..
తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో తిరుపతి నుంచి దువ్వాడకు (Vizag) వెళ్లేందుకు వి.మూర్తి తనకు, తన కుటుంబ సభ్యులకు నాలుగు 3ఏసీ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారికి మొదట B-7 కోచ్‌లో బెర్త్‌లు కేటాయింపు అయ్యాయి. అయినప్పటికీ, వారి వసతి 3A నుంచి 3Eకి మార్చారని మూర్తికి తర్వాత మెసేజ్ వచ్చింది.

జూన్ 5, 2023న మూర్తి, అతని కుటుంబం తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కారు. వారి ప్రయాణంలో మరుగుదొడ్డికి వెళ్లే సరికి నీళ్లు లేవు. దానికి తోడు కోచ్ లో ఏసీ సరిగ్గా పని చేయలేదు. కోచ్ మొత్తం మురికిగా ఉంది. ఈ సమస్యలపై మూర్తి దువ్వాడలోని సంబంధిత కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కమిషన్ ఏం చెప్పిందంటే?
జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (విశాఖపట్నం) బెంచ్ వారు టిక్కెట్లు సేకరించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ప్రామిస్ చేసినందున ఫంక్షనల్ టాయిలెట్లు, వర్కింగ్ ఏసీ వంటి ప్రాథమిక సౌకర్యాలను నిర్ధారించడానికి రైల్వే బాధ్యత వహిస్తుందని పేర్కొంది.

అనంతరం రైల్వే శాఖ విచారణ సమయంలో పైపుల్లో ఎయిర్‌ బ్లాక్‌ అవడంతో నీరు సరిపడా రాలేదని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో సౌకర్యవంతమైన జర్నీకి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సంస్థపై ఉందని కమిషన్ పేర్కొంది. ప్రయాణికుడు ఫిర్యాదు చేసినా స్పందించలేదని చెప్పింది. కమిషన్ ప్రయాణికుడికి రూ.25 వేల పరిహారంతో పాటు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు కలిపి రూ.30 వేలు కట్టాలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: Train Journey: రైలు ప్రయాణంలో హెల్త్ ఎమర్జెన్సీ? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
Train: రైలు బోగీల్లో ఈ తేడాలు గమనించారా? ఇనుప కడ్డీలు అడ్డంగా ఎందుకుంటాయంటే..
Women: ఏపీలో మహిళలు, చిన్నారులపై దాడులు.. ఎన్‌డబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం!
FIR: మీపై ఎఫ్ఐఆర్ నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? 

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు