Crime News: ఓ టీనేజ్ అమ్మాయి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ మెయింటైన్ (Crime News) చేయడం ఇప్పుడు 19 మంది కొంప ముంచింది. ఆమె హెచ్ఐవీ బారిన పడటమే కాదు. మరో 19 మందికి అంటించింది.
నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ యువతి 19 మంది యువకులకు HIV సోకేలా చేసింది. ఆ యువతికి చాలా వ్యసనాలు ఉన్నాయని తేలింది. ఆమె అవసరాలు తీర్చుకునేందుకు పలువురితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. ఆమెతో పలువురు శృంగారంలో పాల్గొనడంతో వారికి ఎయిడ్స్ వ్యాప్తి చెందింది. ఆమె ద్వారా ఈ వ్యాధి వ్యాపించిందని అధికారులు తేల్చారు. ఆమె డబ్బుల కోసం అనేక మంది యువకులతో సెక్స్ అఫైర్ పెట్టుకుందని నిర్ధారణ అయ్యిందన్నారు.
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఒక అమ్మాయి చేసిన పనికి ఈ యువకులందరూ హెచ్ఐవీ బారిన పడ్డారని నైనిటాల్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ప్రకటించారు. ఆ యువతికి హెరాయిన్ తీసుకునే అలవాటు ఉందని, ఈ వ్యసనమే ఇందరి జీవితాలను నాశనం చేసిందన్నారు.
డబ్బుల కోసం, జల్సాల కోసం తప్పుడు మార్గాలు అనుసరించడం వల్ల అమ్మాయికి హెచ్ఐవీ సోకిందన్నారు. ఆమె వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది యువకులు డబ్బు ఎరవేసి, డ్రగ్స్ ఆశ చూపి వశపర్చుకున్నారని తేల్చారు. ఇలా ఆమె ద్వారా యువకులందరికీ జబ్బు సోకినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
సాధారణంగా రాష్ట్రం మొత్తానికి ఏడాదికి 20 కేసులు రావడం సహజమని, ఇలా ఒకేసారి ఒకే ప్రాంతంలో 19 మందికి హెచ్ఐవీ నిర్ధారణ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ఇంకా ఎంతమందికి ఈ వ్యాధిసోకిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. కేవలం రామ్‌నగర్ ప్రాంతంలో 17 నెలల్లో 45 కేసులు వెలుగు చూశాయని అధికారులు తెలిపారు. ఇప్పుడు వ్యాధిసోకిన వారు ఒక్కరొక్కరిగా అనారోగ్యం బారిన పడడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకుని వారికి టెస్టులు చేయించడంతో ఈ బాగోతం బయట పడింది.
ఇప్పుడు ఎయిడ్స్ సోకిన వారిలో చాలామంది పెళ్లైన వారేనని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎయిడ్స్ సోకిన వారికి ఒకే అమ్మాయి ద్వారా వచ్చినట్లు కన్ఫంగా తెలియదని, ఒకరి తెలియకుండా ఒకరితో ఆమె రిలేషన్ మెయింటైన్ చేయడంతో ఇలా జరిగి ఉండొచ్చంటున్నారు.
యువత విచ్చలవిడి తనానికి అలవాటు కావొద్దని, ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో సేఫ్టీ వాడాలని సూచిస్తున్నారు వైద్యులు, ప్రభుత్వాధికారులు. సురక్షిత చర్యలు తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. క్షణికమైన సుఖానికి నిండు జీవితాలు బలి చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు.
ఇవీ చదవండి: Gut Health: మారుతున్న సీజన్.. మీ ప్రేగు ఆరోగ్యానికి 9 చిట్కాలు
World Mental Health Day: మెరుగైన మానసిక ఆరోగ్యం కోసం 10 టిప్స్
Bone Health: ఎముకల బలానికి క్యాల్షియం మాత్రలు వేసుకుంటున్నారా? ఏం జరుగుతుందంటే..
AP Crime News: కాశీబుగ్గలో ఇద్దరు బాలికలపై అత్యాచారం!
AP Crime News: బద్వేలులో విద్యార్థినిపై అఘాయిత్యం అనాగరిక చర్య
