HomeAndhra PradeshTTD Board: టీటీడీ బోర్డులో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణుడికీ దక్కని చోటు

TTD Board: టీటీడీ బోర్డులో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణుడికీ దక్కని చోటు

TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డు సభ్యులను నిన్న ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే, పాలకమండలిలో (TTD Board) బ్రాహ్మణులకు మొండిచేయి చూపింది చంద్రబాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క బ్రాహ్మణ వ్యక్తికి కూడా చోటు దక్కలేదు.

దీనిపై ఏపీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీని చంద్రబాబు గాలికి వదిలేశారని పలువురు విమర్శిస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో టీటీడీ పాలకమండలిలో పూజారితో ఒక బ్రాహ్మణ వ్యక్తికి సభ్యులుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.

నిన్న ప్రకటించిన పాలకమండలిలో ఏపీ నుంచి ఒక్క బ్రహ్మణునికి కూడా అవకాశం దక్కలేదని, చంద్రబాబు మరోసారి మోసం చేశారంటూ బ్రాహ్మణ వర్గాలు మండిపడుతున్నాయి.

దీనిపై వైయస్సార్ సీపీ నేత మల్లాది విష్ణు స్పందించారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు మాటలెక్కువ పని తక్కువ అన్నారు. దేవస్థానం బోర్డుల్లో బ్రాహ్మణులకు స్థానం కలిపిస్తామని చెప్పారని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లిస్టులో బ్రాహ్మణులు ఎందుకు లేరని ప్రశ్నించారు.

కేబినేట్ మీటింగ్ లో, జీవోలో గొప్పలు చెప్పకున్నారు. 2014, 2019, 2024లో ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక్కరికి కూడా పోటీ చేయాడానికి టికెట్ ఇవ్వలేదు. 600 మంది వేదపడింతులకు రూ.3 వేలు చొప్పన స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు కమిషనర్ చెప్పారు.

600 మంది వేదపడింతులకు స్కాలర్ షిప్ తీర్మానం చేసింది వైసీపీ. తీర్మానం చేయడమే కాదు.. నిధులు కూడా విడుదల చేశాం.. బ్రాహ్మణుల చోటు లేదు కాబట్టే దాన్ని పక్కదారి పట్టించడానికి స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకు బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే చిన్నచూపు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ.. ఎక్కడా బ్రాహ్మణులకు స్థానం కలిపించలేదు. కేబినెట్ లో వాళ్లు చేసిన నిర్ణయాన్ని నేడు ఉల్లంగించారు. ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. బ్రాహ్మణులకు టీటీడీలో ప్రాతినిధ్యం లేదు. హిందూ సమాజానికి, ఆధ్యాత్మిక చింతనలో, బ్రాహ్మణ వర్గాన్ని గౌరవించడంలో పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందింది.’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు.

సగం మంది ఇతర రాష్ట్రాల వారే..
టీటీడీ పాలకమండలిలో సగం మంది ఇతర రాష్ట్రాలవారిని నియమించారు. 12 మంది ఏపీ, 12 మంది ఇతర రాష్ట్రాల సభ్యులను ప్రభుత్వం నియమించింది. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం 24 మందితో పాలకమండలిని ఏర్పాటు చేశారు.

టీటీడీ పాలకమండలిలో జనసేన నుంచి ముగ్గురికి చోటు దక్కింది. ఏపీకి చెందిన జనసేన నేతలకు ఛాన్స్ దక్కకపోవడం గమనార్హం. టీటీడీ పాలకమండలిలో జనసేన నుంచి రంగశ్రీ, బి.మహేందర్ రెడ్డి, ఆనంద్ సాయి ఉన్నారు. జనసేన కోశాధికారి ఏవీ.రత్నం‌ భార్య రంగశ్రీ. ప్రస్తుతం జనసేన ఉపాధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి ఉన్నారు. 2019లో మల్కాజిగిరి ఎంపీగా మహేందర్ రెడ్డి పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.

ఇవీ చదవండి: TTD Chairman: లోకేష్ మార్క్.. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. ఆర్కే పరిస్థితి?
TTD Big News: టీటీడీ కీలక నిర్ణయాలు.. 15 ఏళ్లలోపు చిన్నారులకు నడక దారిలో రిస్ట్రిక్షన్స్‌.. బైక్‌లకు రాత్రిపూట నో ఎంట్రీ!
TTD Chairman Bhumana: టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం
AP Cabinet: ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. పలు పాలసీలకు ఆమోదం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు