HomeAndhra PradeshAP Crime News: కాశీబుగ్గలో ఇద్దరు బాలికలపై అత్యాచారం!

AP Crime News: కాశీబుగ్గలో ఇద్దరు బాలికలపై అత్యాచారం!

AP Crime News: ఏపీలో అత్యాచారాల పర్వం ఆగడం లేదు. ఏదో ఒక మూలన అత్యాచారం జరిగిందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో (AP Crime News) దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితుల కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని రాజీ కుదర్చడానికి కొందరు పెద్దలు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని సమాచారం. కాశీబుగ్గకు చెందిన 16 ఏళ్ల వయసు గల ముగ్గురు బాలికలు, నేతాజీనగర్, సూదికొండ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు ఈ నెల 19న రాత్రి పుట్టిన రోజు పేరిట వేడుక నిర్వహించుకోవడానికి కోసంగిపురం సమీపంలోని ఓ కాలనీకి చేరుకున్నారు.

అక్కడ ఓ ఇంట్లో యువకులు ఫూటుగా మద్యం సేవించారు. ఈ క్రమంలో బాలికలకు కూడా మద్యం తాగించారని సమాచారం. భోజనం చేసిన అనంతరం ఇద్దరు బాలికలపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరో బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి యత్నించగా ఆమె ప్రతిఘటించినట్లు వార్తలు వచ్చాయి.

ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడుతుండగా మరొకరు సెల్‌ఫోన్లో దాన్ని చిత్రీకరించారు. రాత్రి 11 గంటల అనంతరం అందరూ కలిసి ఇళ్లకు చేరుకున్నారని తెలుస్తోంది. అత్యాచారానికి గురైన ఓ బాలిక జరిగిన తతంగాన్ని ఆదివారం ఉదయాన్నే కుటుంబ సభ్యులతో చెప్పుకుంది.

విషయం బయటకు పొక్కడంతో యువకుల కుటుంబీకులు, స్థానికంగా ఉన్న కొందరు పెద్ద మనుషులను ఒకచోటకు చేర్చి రాజీ కుదిర్చే పనిలో పడ్డారట. ఇదిలా ఉండగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై కాశీబుగ్గ సీఐ డి.మోహనరావు మాట్లాడుతూ.. ఈ తతంగాన్ని చైల్డ్‌లైన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వారు విచారణ జరిపి ఇచ్చే నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Badvel Crime: విద్యార్థిని హత్య నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?
Vizianagaram Crime: గుర్లలో డయేరియా మృతులు ఎంతమంది? ప్రభుత్వం ఏమందంటే..
AP Crime News: బద్వేలులో విద్యార్థినిపై అఘాయిత్యం అనాగరిక చర్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు