MacBook Air With M4 Chip: ఆపిల్ కంపెనీ ప్రస్తుత తరం M4 చిప్‌తో నవీకరించిన మ్యాక్‌బుక్ ఎయిర్‌పై పని చేస్తోంది. ఇది 2025 ప్రారంభంలో రిలీజ్ (MacBook Air With M4 Chip) అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కుపెర్టినో కంపెనీ ఎం4 చిప్‌తో కూడిన కొత్త మ్యాక్ (Mac) స్టూడియో మోడల్‌ను డెవలప్ చేస్తోంది. ఈలోపు వచ్చే వారం కొత్త iMac, MacBook Pro మరియు Mac miniతో సహా కొత్త M4-ఆధారిత Mac మోడళ్లను ఆపిల్ లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరంలో కంపెనీ చివరి హార్డ్‌వేర్ లాంచ్ అయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది.
2025 ప్రారంభంలో..
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఆపిల్ త్వరలో కొత్త M4 మాక్‌బుక్ ఎయిర్ మోడల్‌ల ఉత్పత్తిని ప్రారంభించవచ్చని పేర్కొంది. ఇది కొత్త iPhone SE, iPad మరియు iPad ఎయిర్ మోడల్‌లతో పాటు 2025 ప్రారంభంలో ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. M3 చిప్‌తో ప్రస్తుత తరం MacBook Air మార్చిలో వచ్చింది. మరింత పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో రిఫ్రెష్ చేసిన మోడల్ వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.
రాబోయే మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్‌లు 13-అంగుళాల (J713), 15-అంగుళాల (J715) డిస్‌ప్లే పరిమాణాలలో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత తరం మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్‌ల మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటాయి. డిసెంబర్‌లో వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత ఈ వేరియంట్‌లను పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
M4 చిప్ (J575)తో నవీకరించిన Mac స్టూడియో మోడల్ ఇప్పుడే వచ్చే చాన్స్ లేదట. ఇది మార్చి, జూన్ మధ్య ప్రారంభించే చాన్స్ ఉందని తెలుస్తోంది. Apple Mac Proని M4 చిప్‌తో ఎప్పుడు రిఫ్రెష్ చేస్తుందనే దానిపై క్లారిటీ లేదు.
Mac మోడల్స్ రిఫ్రెష్
ఈ నెల ప్రారంభంలో యాపిల్ M4 చిప్ (J604)తో 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోను, M4 చిప్‌లతో (J616) హై-ఎండ్ 14-అంగుళాల (J614), 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లను విడుదల చేస్తుందని గుర్మాన్ పేర్కొన్నారు. అదేవిధంగా M4 లేదా M4 ప్రో చిప్‌లతో కూడిన Mac మినీ (J773)తో పాటుగా M4 చిప్ (J623)తో రిఫ్రెష్ చేసిన iMacని కూడా కంపెనీ ప్రారంభించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: HBD Prabhas: 45 టర్న్ అయిన ప్రభాస్.. చిరు, రామ్ చరణ్ సహా ప్రముఖల గ్రీటింగ్స్
BSNL New Logo: బీఎన్ఎన్ఎల్ కొత్త లోగోపై దుమారం.. అన్నింటా కాషాయమా!
Amaravati Drone show: తొలి రోజు డ్రోన్ షో విశేషాలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే
New Smart Phone: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
5G Smartphone: రూ.15,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..
