HomeAndhra PradeshFree Gas Cylinder: మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక అప్ డేట్!

Free Gas Cylinder: మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక అప్ డేట్!

Free Gas Cylinder: నిన్న సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నాలుగో ఈ-క్యాబినెట్ సమావేశం జరిగింది. 15 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని (Free Gas Cylinder) నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ప్రారంభించింది కూటమి ప్రభుత్వం.

ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోకు అనుగుణంగా సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా అక్టోబరు 31 న దీపావళి పండుగ నుండి మూడు సిలిండర్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరోజే సిలిండర్లను డెలివరీ చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. మూడు రోజుల ముందు నుంచే సిలిండర్ల బుకింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ముఖ్యాంశాలు
* ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వ్యయప్రయాసలకోర్చి కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు ముందడుగేసింది.
* మూడు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటారు.
* ప్రతి గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92, ఈ మొత్తం సొమ్ము రాయితీపై పూర్తిగా ఉచితంగా అర్హమైన కుటుంబాలు అన్నింటికీ అందజేస్తారు. ఈ రాయితీ సొమ్మును డీబీటీ ద్వారా లబద్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.

* డెలివరీ అయిన 48 గంటల్లోపే సొమ్ము జమ అయ్యే విధంగా చర్యలు.
* మూడు బ్లాక్ పీరియడ్లలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబరు, డిసెంబర్ నుండి మార్చి వరకు.. మూడు బ్లాకుల్లో ఈ మూడు సిలిండర్లను పంపిణీ చేస్తారు.

* ఈ పథకం అమల్లో సమస్యలు ఉంటే వాటి తక్షణ పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేస్తారు.
* ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు అంటే రూ.2,684 మేర మీకు లబ్ధి జరుగుతుంది. దీని కోసం ఏడాదికి రూ.2,684 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది.

Read also: CBN in Party Meeting: చెత్తను వారసత్వ సంపదగా ఇచ్చి వెళ్లారు
CBN in Party Meeting: ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: సీఎం చంద్రబాబు
Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు
CM Chandrababu: జే బ్రాండ్స్ తెచ్చి ప్రజల ప్రాణాలు తీసిన జగన్: చంద్రబాబు
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు