సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Ananya Nagalla: కమిట్మెంట్‌పై అనన్య నాగళ్ల కామెంట్స్ వైరల్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 23 అక్టోబర్ 2024

Ananya Nagalla: సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇటీవలి కాలంలో కాస్టింగ్ కౌచ్ అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. కొందరు సినీ నటులు సినిమా చేయడానికి లేదా అవకాశాలు రావడానికి కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేఫథ్యంలో కమిట్మెంట్ గురించి యువ నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) రియాక్ట్ అయ్యింది. ఓ జర్నలిస్ట ప్రశ్నకు బదులిచ్చింది.

అనన్య నాగళ్ల నటించిన చిత్రం ‘పొట్టేల్‌’ (Pottel) మూవీ ఈనెల 25న (pottel movie release date) రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో ఆమె బిజీగా గడుపుతోంది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో అనన్యకు అనుకోని ప్రశ్న ఎదురైంది. కమిట్‌మెంట్‌ను ఎదుర్కొన్నారా? అని ఓ మీడియా మిత్రుడు ఆను ప్రశ్నించడంతో ఇండస్ట్రీలోనే కాదు, సామాజిక మాధ్యమాల వేదికగానూ తీవ్ర చర్చ మొదలైంది. తాజాగా ఈ అంశంపై అనన్య స్పందించారు.

‘‘ఇంత డైరెక్ట్‌గా వేదికపై ఉన్న నటిని సున్నితమైన అంశంపై ఎలా ప్రశ్నించారా అని ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా.. అనుకున్నా. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. 5 సంవత్సరాల నుంచి దీని కోసం నేను ఇంట్లో ఫైట్‌ చేస్తున్నా.’’ అని తెలిపింది.

ఇండస్ట్రీలోకి వచ్చి కుటుంబం పరువు తీసిందని కొందరు కామెంట్స్ చేస్తుంటారని, కానీ, పొట్టేల్‌ మూవీ చూశాక తమ కుటుంబం అంతా గర్వంగా ఫీలవుతారని భావిస్తున్నానంది. ఇంత గొప్ప సినిమాలో మా అమ్మాయి నటించిందంటూ తన తల్లి అందరితో చెబుతారని చాలా ఆనందించానంది. అలాంటప్పుడు ఈ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇప్పుడు తాను విజయవంతం అయినా కమిట్మెంట్ కు యాక్సెప్ట్ చేశాను కాబట్టి సక్సెస్‌ అయ్యానని అందరూ భావిస్తారని వాపోయింది. ఇప్పుడు మళ్లీ బంధువులందరూ ఇదే విషయం తన తల్లిని అడుగుతారని, ఆ జర్నలిస్ట్‌ ప్రశ్న వేసినప్పుడు తనకు ఇన్ని ఆలోచనలు రాలేదన్నారు. సదరు జర్నలిస్టు అమ్మాయికి సంస్కారం లేదా? అని అనుకున్నానని, ఇంటికెళ్లాక దీనిపై చాలా ఆలోచించానని అనన్య చెప్పింది. ఈ విషయంలో మీడియా తనకు సపోర్ట్ చేయడం సంతోషంగా ఉందంది.

ఇవీ చదవండి: OnePlus 13: వన్ ప్లస్ 13 వచ్చేస్తోంది.. కలర్స్, డిజైన్ ఎలా ఉన్నాయి?
Mouni Roy: దసరా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో మౌని రాయ్.. ఫొటో గ్యాలరీ
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు
Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!

ట్యాగ్స్: , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading