HomeAndhra PradeshVizianagaram: ఆ మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారి చేత విచారణ

Vizianagaram: ఆ మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారి చేత విచారణ

Vizianagaram: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా (Vizianagaram) వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

అయితే అసలు ఘటనకు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిలో భాగంగా సీనియర్ ఐఎఎస్ అధికారి కె.విజయానంద్ తో ఘటనపై విచారణ జరిపించాలని నిర్ణయించారు. మరణాలకు అసలు కారణం ఏంటి? ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు ఏంటనేది తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలని భావిస్తున్నారు.

ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని, సమస్య పరిష్కారం అయ్యేవరకు తాగునీరు సరఫరా చేయాలని చంద్రబాబు సూచించారు. వైద్య శిబిరాలు కొనసాగించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ధైర్యం చెప్పి, సమస్య పరిష్కారం అయ్యేవరకు వారికి అండగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు.

విజయనగరం జిల్లాలో డయేరియా మరణాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. విజయనగరం జిల్లా గుర్లలో తీవ్ర డయేరియా విజృంభించి 11 మంది దుర్మరణం చెందగా, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: Sugar patients: చక్కెర వ్యాధిగ్రస్తులు ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
AP Cheap Liquor: రూ.99 మద్యం కాంట్రాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
CBN in Party Meeting: ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: సీఎం చంద్రబాబు
CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..
Andhra News: చంద్రబాబు అలా మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు