శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

AP Cheap Liquor: రూ.99 మద్యం కాంట్రాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 19 అక్టోబర్ 2024

AP Cheap Liquor: మద్యం, ఇసుక విషయంలో తలదూర్చొద్దంటూ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నిన్నటి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల సమావేశంలో ఆయన (AP Cheap Liquor) కీలక వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్ విషయంలో వారసత్వంగా వస్తున్న మాగుంట ఫ్యామిలీ లాంటి వారు వ్యాపారం చేసుకోవచ్చని సూచించారు. కొత్తగా ఇందులో కూడా ఇన్వాల్ కావాలనుకుంటే పార్టీ ప్రతిష్ట పోతుందని చెప్పారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల విషయంలో కూటమి పార్టీల నేతల బెదిరింపులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆరోపణల నుంచి బయట పడేందుకు సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

మాగుంట కుటుంబం గతంలో టీడీపీలో ఉండేది. తర్వాత వైయస్సార్ సీపీలోకి చేరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అరెస్టు అయ్యారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి నాటి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. అనంతరం వీరు టీడీపీలోకి వెళ్లి టికెట్ పొందారు.

చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.99కే చీప్ లిక్కర్.. ఇప్పటికీ అమలు కాలేదు. ఇప్పుడు ఆ లిక్కర్ కాంట్రాక్ట్ మాగుంట కుటుంబానికే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.

లిక్కర్ బిజినెస్‌లో అక్రమాలు చేస్తున్న మాగుంట కుటుంబం.. టీడీపీలో చేరగానే కడిగిన ముత్యం అయిపోయిందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మాగుంట కుటుంబం మాత్రమే లిక్కర్ లో సంపాదించుకోవాలా? మేము కూడా బెదిరింపులకు దిగి సంపాదించుకోవద్దా? అంటూ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, కీలక నేతలు సీఎం చంద్రబాబుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

ఇవీ చదవండి: YS Jagan on Liquor: లిక్కర్ పాలసీపై వైయస్ జగన్ సంచలన ట్వీట్
AP Liquor: ఏపీలో లిక్కర్ సిత్రాలు.. ధర్మవరంలో మంత్రి సన్నిహితుడికి 5 షాపులు!
Liquor: బీరు, వైన్, విస్కీ, బ్రాందీ.. బరువును ఎలా పెంచుతాయంటే..
AP Liquor: ఏపీలో మందుబాబులకు అప్ డేట్.. విదేశీ మద్యంపై సర్కార్ కీలక నిర్ణయం!
AP Liquor Policy: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త మద్యం షాపులు

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading