Nara Lokesh: తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, రెడ్ బుక్‌లో రాసిన పేర్లన్నీ తప్పు చేసిన వారివేనని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. కియా పరిశ్రమను (Kia Industry) చంద్రబాబు (Chandrababu) తీసుకొస్తే రాజశేఖర్ రెడ్డి (YSR) ఉత్తరం రాశాడని ఆత్మ చెప్పినట్టు, ఇప్పుడు కూడా టీసీఎస్ (TCS) వాళ్లే తెచ్చారని ఇంకో ఆత్మ జగన్‌కి (YS Jagan) చెప్పినట్టుందంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
2014-19 మధ్య 44 వేల పరిశ్రమల ద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని శాసనమండలి సాక్షిగా అంగీకరించారని తెలిపారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తరిమేసిన పరిశ్రమలన్నీ ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ తిరిగి వస్తున్నాయన్నారు. లూలూ, అశోక్ లేలాండ్, టీసీఎస్ వస్తున్నాయని లోకేష్ చెప్పారు.
కొంతమంది తనను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారని వైయస్సార్ సీపీ బ్లూ బుక్ గురించి ప్రస్తావించిన ప్రశ్నకు సమాధానంగా లోకేష్ చెప్పారు. యువగళంలో వంద సభల్లో చెప్పినట్టుగానే ఏ అధికారులు, నాయకులు ప్రజల్ని, టీడీపీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారోవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పామని, అదే చేస్తున్నామని చెప్పారు. ఇందులో కేర్ చేసేదే లేదన్నారు. వాళ్లు ఏం పుస్తకాలు పెట్టుకుంటారో పెట్టుకోనివ్వండంటూ వ్యాఖ్యానించారు.
దాదాపు 10 రోజులు వరదల్లో చంద్రబాబు సహా అందరూ పనిచేశారన్నారు. వారిచ్చిన కోటి రూపాయలు దేనికి ఖర్చు చేశారో సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. అది చాలదన్నట్టు అగ్గిపెట్టెలకు ఖర్చు చేశారని ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరికి నష్టం జరిగిందో చెబితే వారికి న్యాయం చేయడానికి సిద్దంగా ఉన్నామని, ప్రజాదర్బార్‌లో పరిష్కరిస్తున్నామన్నారు. తాము పరదాలు కట్టుకుని తిరగడం లేదన్నారు. గతంలో వరదలొస్తే జగన్ కనీసం తాడేపల్లి ఇంటి నుంచి బయటకు రాలేదన్నారు.
ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. 2019-24 మధ్య ఇలాగే అబద్ధాలు చెప్పడం వలనే 11 సీట్లకు పరిమితం అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్‌లో వారి పేరుందేమోనని భయపడుతున్నారని చమత్కరించారు.
మరిన్ని వార్తల అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VaDKB4h3rZZU4gwREr1R
ఇవీ చదవండి: Nara Lokesh: పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నా: లోకేష్
High court on Lokesh: సమస్యలు సృష్టిస్తుంటే అనుమతులు రద్దు చేయండి.. లోకేష్ పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Chandrababu and Lokesh: చంద్రబాబు, లోకేష్‌కు న్యూస్ స్పేస్ తగ్గిపోయిందా? జనసేనాని డామినేషన్ చేస్తున్నారా?
Andhra News: చంద్రబాబు అలా మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది!
Rajinikanth: రజనీకాంత్ పై డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. కథ మార్చేశారా?
