Rohit Sharma: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముంగిట ఫ్రాంచైజీలన్నీ ఎంత మందిని రిటైన్ చేసుకోవాలన్న దానిపై క్లారిటీ వస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు క్రికెటర్లను అట్టిపెట్టుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యం ఓకే చెప్పింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కలిపి ఉంటుంది. ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31లోపు సమర్పించాల్సి ఉంటుంది.
ఇక ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుందన్నది అభిమానుల్లో, క్రీడా విశ్లేషకుల్లో ఆసక్తిగా నెలకొంది. మరోవైపు ఎవరికి వదిలేస్తారన్ననది కూడా ఆసక్తికరమే. స్టార్ ప్లేయర్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వచ్చే మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకుంటాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముంబై ఇండియన్స్ పగ్గాలు హార్దిక్ పాండ్యకు ఇచ్చిన సంగతి తెలిసిందే.
హార్దిక్ పాండ్యను సారథిగా చేసిన నాటిట నునంచి ఫ్రాంఛైజీకి, రోహిత్‌కు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రోహిత్ ముంబై ఇండియన్స్‌ను వీడాలని హిట్ మ్యాన్ నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) స్పందించాడు. హిట్ మ్యాన్ ఫ్యూచర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ వచ్చే ఐపీఎల్ సీజన్ కు సంబంధించి వేలం బరిలోకి దిగితే ఆక్షన్ మరింత ఆసక్తికరంగా మారుతుందని భజ్జీ చెప్పాడు.
‘‘రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుందా? లేదా అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. హిట్ మ్యాన్ వేలంలోకి వస్తే అతని కోసం ఏ జట్టు బిడ్ వేస్తుందో చూసేందుకు అభిమానులు, సీనియర్ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఉన్నారు. చాలా ఫ్రాంఛైజీలు రోహిత్ శర్మను తమ జట్టుకు కెప్టెన్ గా చేసుకోవాలని, దక్కించుకోవాలని చూస్తున్నాయి. హిట్ మ్యాన్ అద్భుతమైన కెప్టెన్, ఆటగాడు కూడా.
మ్యాచ్ విన్నర్‌గా ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. రోహిత్‌కు ప్రస్తుతం 37 ఏళ్లు. అయినా అతడిలో ఇంకా చాలా ఆట ఉంది. అతడు వేలంలోకి వస్తే భారీ ధర పలకడం గ్యారెంటీ.‘‘ అని హర్భజన్ వ్యాఖ్యానించాడు.
2011 నుంచి ముంబై ఇండియన్స్‌కు హిట్ మ్యాన్ ఆడుతున్నాడు. 2013 సీజన్ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. అతడి సారథ్యంలో ముంబై (2013, 2015, 2017, 2019, 2020) ఐదు సార్లు ఐపీఎల్ టోర్నీ విన్నర్ గా నిలిచింది.
Read also: Rohit sharma: ఫిట్ నెస్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఐపీఎల్ వేలం.. ఈ ఆటగాళ్ల గిరాకీ పెరిగిందా?
IPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్..
Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు.. అత్యధిక సార్లు డక్‌ఔట్ అయ్యింది ఎవరంటే..!
Nitish Kumar Reddy: బంగ్లాపై తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సత్తా.. సిరీస్ కైవసం
