Crime News: షేర్ మార్కెట్ పేరిట మోసాలు నిత్యకృత్యం అయ్యాయి. తాజాగా షేర్లు విక్రయిస్తామని మాయమాటలు చెప్పి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. రూ.10 వేలు వస్తాయని ఆశ చూపెట్టి ఏకంగా రూ.2.29 కోట్లు కొల్లగొట్టారు.
దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బాచుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (51) ఫోన్ నంబర్ ను గుర్తుతెలియని దుండగులు జూలై 10వ తేదీన ‘కేఎస్‌ఎల్ అఫీషియల్ స్టాక్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూపులో యాడ్ చేశారు. నారాయణ జిందాల్ అనే పర్సన్ కోటాక్ సెక్యూరిటీస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నారని, షేర్లు కొనడం, విక్రయించడంపై మెలకువలు చెబుతారంటూ గ్రూపులో మెంబర్లు చాటింగ్ చేసుకునే వారు.
అక్టోబర్ 2 నుంచి కోటాక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్ట్రాటజీ ప్లాన్‌న మొదలు పెడుతున్నారంటూ నారాయణ జిందాల్ పేరుతో ఒక వ్యక్తి పోస్టు పెట్టాడు. ఇందులో చేరాలంటే కోటాక్ ప్రో యాప్ మీ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలని, వీఐపీ ట్రేడింగ్ ప్లాన్‌లో మీరు చేరినట్లయితే లాభాలే లాభాలంటూ పోస్టులు పెట్టాడు.
ఇందులో చేరినందుకు తమకు లాభాలు వచ్చాయని కూడా గ్రూప్ మెంబర్ల పేరిట పోస్టులు పెట్టేవారు. ఇదంతా వాస్తవమని నమ్మిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఆ యాప్ ను తన ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులోని కస్టమర్ కేర్ వాళ్ల సూచనల మేరకు డబ్బులు పంపించసాగాడు. తొలిసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టినందుకు 10 శాతం లాభం వచ్చినట్లు యాప్‌లో మరుసటి రోజు సైబర్ నేరగాళ్లు డిస్ ప్లే చేశారు. దీంతో అతను భారీ లాభాలు ఆశించి పలుమార్లు మరో రూ.90 లక్షలు యాప్ లో యాడ్ చేసి ఇన్వెస్ట్ మెంట్ చేశాడు. ఇలా రూ.1.5 కోట్ల విలువైన ఐపీవో షేర్లు కేటాయిస్తున్నామని మళ్లీ రూ.80 లక్షలు, రూ.49.62 లక్షలు, రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.2.29 కోట్లు యాప్ లోకి ట్రాన్స్ ఫర్ అయ్యేలా దుండగులు మాయమాటలు చెప్పి లాగేసుకున్నారు.
కాగా, మొత్తంగా కేవలం రూ.10 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే చాన్స్ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇచ్చారు. రూ.2.29 కోట్ల పెట్టుబడికి రూ.1.10 కోట్ల లాభం వచ్చిందని యాప్ లో చూపించినా కేవలం రూ.10 వేలే తీసుకునే చాన్స్ ఇచ్చారు. మొత్తం రూ.3.29 కోట్లు విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.40 లక్షల దాకా కట్టాలని షరతు విధించారు. డబ్బు మొత్తం విత్‌డ్రా చేసుకోవాలంటే రకరకాల కొర్రీలు పెడుతుండడంతో సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అనుమానం బలపడింది. స్టాక్ మార్కెట్ లో తనకు తెలిసిన నిపుణులను ఆరా తీస్తే ఇదంతా ఫ్రాడ్ అని తేలింది. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియపై కలెక్టర్ కు గంగుల నాని ఫిర్యాదు
Constable Jobs: ఏపీలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ.. 5 నెలల్లో పూర్తికి కసరత్తు
PV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్ పై రఘురామ ఫిర్యాదు
Hyderabad: న్యూడ్ ఫొటోలు పంపుతావా.. లేదా.. ఐటీ ఉద్యోగికి వేధింపులు
Hyderabad: కక్కుర్తి పడ్డారో ఖతమైపోతరు.. హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్!
