HomeCinemaVettaiyan: వేట్టయన్‌ కు తెలుగు టైటిల్ ఎందుకు పెట్టలేకపోయామంటే..

Vettaiyan: వేట్టయన్‌ కు తెలుగు టైటిల్ ఎందుకు పెట్టలేకపోయామంటే..

Vettaiyan: సూపర్ స్టార్, సౌత్ అగ్రహీరో రజనీకాంత్‌ (Rajnikanth) కథా నాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్‌’ (Vettaiyan). దసరా కానుకగా ఈ నెల 10న రిలీజ్ అయ్యింది. తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. అయితే, ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఎందుకు పెట్టలేదన్నది అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న.

నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ దీనిపై తాజాగా స్పందించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ లెటర్ రిలీజ్ చేసింది. ‘‘తెలుగులో ‘వేటగాడు’ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాలని భావించాం. ఆ పేరు అందుబాటులో లేకపోవడంతో ఒరిజినల్‌ పేరుతోనే రిలీజ్‌ చేస్తున్నాం. ఇతర డబ్బింగ్‌ వెర్షన్లకూ ‘వేట్టయన్‌: ది హంటర్‌’ పేరు పెట్టాం. తెలుగు ప్రేక్షకులు ఎప్పటిలాగే ఆదరించాలని కోరుకుంటున్నాం.

తెలుగు చిత్ర సీమకు చెందిన ఎంతోమందితో మేం కలిసి చిత్రాలు చేశాం, పని చేశాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘సీతారామం’ వంటి తెలుగు సినిమాలను తమిళ ప్రేక్షకులకు కానుకగా ఇచ్చాం. మమ్మల్ని అర్థం చేసుకుంటారని కోరుతున్నాం. తెలుగు భాష, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, తెలుగు మీడియా, తెలుగు ప్రేక్షకులపై లైకా ప్రొడక్షన్స్‌కు అమితమైన గౌరవం ఉంది’’ అని నిర్మాణ సంస్థ స్పష్టత ఇచ్చింది.

తెలుగులో రిలీజ్ అయ్యే మూవీకి తమిళ పేరు ఎలా పెడతారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్స్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ మూవీని విడుదల చేస్తున్న దిల్ రాజు, సురేశ్‌ బాబు టైటిల్ వివాదంపై వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మీడియా సమావేశంలో నటుడు రానా కూడా పాల్గొన్నారు.

‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె. జ్ఞానవేల్‌ రూపొందించిన సినిమానే వేట్టయన్. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ రన్‌టైమ్‌: 163.25 నిమిషాలు (అంటే 2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు). కన్నడ, హిందీలోనూ నిన్ననే రిలీజ్ చేశారు.

Read also: Rajinikanth: రజనీకాంత్ పై డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. కథ మార్చేశారా?
The Raja Saab: రాజా సాబ్ గ్లింప్స్.. డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిందిగా..!
Crime News: రూ.10 వేలు ఆశ చూపించి.. రూ.2.29 కోట్లు కొల్లగొట్టేశారు!
Maa Nanna Superhero Review: మా నాన్న సూపర్‌ హీరో సినిమా రివ్యూ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు