Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడ్డాలో ఓ మైనర్ బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి ఒడిగట్టాడు. అధికారంలో ఉంటూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యోదంతాలపై స్పందన కరువైందని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే ప్రతిపక్షంలో ఉంటే ఈ పాటికి సభలు పెట్టి జగన్ పై నానా యాగీ చేసేవారని గుర్తు చేస్తున్నారు.
జగన్ అధికారంలో ఉండగా రాష్ట్రంలో 32 వేల మందికిపైగా మహిళలు మిస్సింగ్ అయ్యారని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. వాలంటీర్ల ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు గుప్పించిన పవన్.. తాను డిప్యూటీ సీఎం అయ్యే సరికి అవన్నీ మర్చిపోయారు. జగన్ పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండి ఇప్పుడు అధికార పీఠంపైకెక్కిన తర్వాత వారందరినీ వెనక్కి రప్పించారా? అంటూ వైయస్సార్ సీపీ ప్రశ్నలు గుప్పిస్తోంది. సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారం చేపట్టాక అన్నీ మర్చిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగితే ఊరుకునేది లేదని బీరాలు పలికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు జరిగినా పవన్ నోరు మెదపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
బాలికపై అఘాయిత్యం అమానుషం: పవన్
’’పిఠాపురం (Pithapuram) పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. లేనిపక్షంలో నిందితుడు తప్పించుకోడానికి ఆస్కారం కలిగేది. ఈ అమానుష చర్యను సభ్యసమాజం లోని ప్రతి ఒక్కరూ ఖండించాలి.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను. ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలిని, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందచేస్తాము. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని స్పష్టం చేశాము.’’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Read also: Wife Husband: భార్యా భర్తల నడుమ ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?
Haryana Congress: హర్యానాలో కాంగ్రెస్‌కు షాక్ వెనుక 5 కారణాలు!
Instagram: ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. కారణం ఏంటంటే..
Gymnast Dipa: జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం..
