HomeCinemaPushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. పుష్ప 2 ట్రైలర్ ఎప్పుడంటే

Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. పుష్ప 2 ట్రైలర్ ఎప్పుడంటే

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఇది అదిరిపోయే వార్త. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ మరోసారి పుష్పరాజ్ గా రాబోతున్నాడు. 2021లో ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ విడుదలై సంచలన విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ దక్కించుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2 కోసం (Pushpa 2) అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. ఇటీవల దేవర కోసం ఆడియన్స్ ఎదురు చూశారు. ఇప్పుడు మూడేళ్ల గ్యాప్ తర్వాత పుష్పరాజ్ రాబోతున్నాడు. పుష్ప మొదటి పార్ట్ లో బన్నీ నటనకు జాతీయ అవార్డు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని పుష్ప సినిమా మరో మెట్టు పైకి ఎక్కించింది. ఇప్పుడు పుష్ప 2తో మరిన్ని రికార్డులు బద్దలయ్యే చాన్స్ లేకపోలేదు.

వచ్చే నెల నవంబర్ రెండో వారంలో ‘పుష్ప 2’ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండవ వారంలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే సినిమా విడుదలకు మూడు వారాల ముందు నుంచే ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెడతారట. ఈ మేరకు ఫిల్మ్ నగర్ లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప రెండో పార్ట్ లో 10 రెట్లు ఎక్కువ యాక్షన్ ఉన్నట్లు సమాచారం.

‘పుష్ప 2’ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వీనులవిందేనని చెబుతున్నారు. అద్భుత థియేట్రికల్ ఫీలింగ్ కలిగేలా సన్నివేశాలను దర్శకుడు మలిచినట్లు చెబుతున్నారు. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లోనే రిలీజ్ చేయాలని భావించినా షూటింగ్ లో ఆలస్యం కారణంగా డిసెంబర్ 6ను ఫిక్స్ చేశారు. ‘పుష్ప’ మొదటి భాగం అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌ గా మార్చేసింది. ఇక రెండో పార్ట్ తో మరింత పెద్ద స్టార్ గా అల్లు అర్జున్ అవతరించే చాన్స్ ఉంది. రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన పుష్ప మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ‘పుష్ప 2’ మరింత బంపర్ కలెక్షన్లు సుసాధ్యమేనంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పుడు పుష్ప 2 సినిమాను దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్.

Read also: Pushpa 2 Update: పుష్ప 2 మూవీ లేటెస్ట్ అప్ డేట్.. మళ్లీ వాయిదా వేసేదే లే!
National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ నటుడు రిషభ్
Allu Arjun: అల్లు అర్జున్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
Mass Jathara: ఆగస్టు 15న మాస్‌ జాతర.. పుష్ప 2తో సరికొత్త రికార్డులు ఖాయమా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు