Telangana: వరద బాధితుల సహాయార్థం తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి సహాయ నిధికి విన్స్ బయో ప్రోడక్ట్స్ (VinsBioproducts) 51 లక్షల రూపాయలు విరాళం అందించింది. సంస్థ చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ గారు, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ డాగ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ 10 లక్షల రూపాయల విరాళం అందించింది. సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ ఎ.సోమలింగం గౌడ్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు సీఎం అభినందించారు.

వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ కు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.1,01,75,000 విరాళం అందించింది. అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.నర్సింహారెడ్డి, యు.సురేందర్ తో పాటు ఇతర ముఖ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు సీఎం అభినందించారు.
ఇవీ చదవండి: CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth on Auto drivers: ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం.. వారి కోసం ఏం చేస్తారంటే..
Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల
Job Calendar: తెలంగాణలో జాబ్ కేలండర్ రిలీజ్.. ముఖ్యాంశాలు ఇవీ..
Telangana: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్
Telangana: తెలంగాణలో రెండు వారాలపాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేత
