Pawan on YSRCP: గత ఐదేళ్లలో 30వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక్క స్టేట్ మెంట్ కూడా గత సీఎం జగన్ ఇవ్వలేదన్నారు. 219 దేవాలయాల మీద దాడులు జరిగాయి.. రాముడు తల తీసేశారు, అంతర్వేది రథం తగలబెట్టారు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు.. అని ధ్వజమెత్తారు. తిరుపతి వారాహి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
’’1600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు..25లక్షల భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి కోల్పోతే ఇసుక విధానం వల్ల ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అపాలజీ చెప్పలేదు.. ఈయన పాలసీ టెర్రరిజం వల్ల హోండాయ్, అమర్ రాజా, లూలూ గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి.. జంగారెడ్డిగూడెంలో 18 మంది ప్రజలు కల్తీ లిక్కర్ తగి చనిపోతే చిన్న సారీ కూడా చెప్పలేదు..వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల నిధులు మళ్లించింది.. ఆయన సారీ చెప్పలేదు..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్ డ్ డిపాజిట్స్ 400 కోట్లు ఏపీ ఫైనాన్స్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. ఎల్ఐసీ అభయహస్తం నిధులు 2000 కోట్లు విత్ డ్రా చేశారు..లక్ష పద్దెనిమిది వేల కోట్లు బడ్జెట్ లో చూపించలేదని కాగ్ ఆక్షేపించింది..వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా టీం హైకోర్టు , సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా దూషించారు.. వాళ్ల పార్టీ రంగులు వేసేందుకు రూ.2005 కోట్లు ఖర్చు పెట్టారు..ఆవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పై తప్పుడు నివేదిక ఇచ్చారు..ఎన్జీటీ జరిమానా విధించింది..
వేల కోట్ల ఇసుక మాఫియా జరిగింది. పర్యావరణాన్ని దెబ్బతీసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చేత తిట్లు తిన్నాడు..రూ.2556 కోట్ల సాండ్ మైనింగ్ స్కాంలో వెంకట్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. యువతకు ఉపాధి ఇవ్వకుండా రోడ్డున పడేసిన వ్యక్తి జగన్ గారు.. జగన్ ఈరోజు అమాయకుడిలా నటిస్తున్నాడు..అతను అమాయకుడు కాదు.. గత 5సంవత్సరాల్లో అతను చేసిన పనులు, గతంలో అతనిపై ఉన్న అవినీతి కేసులు గుర్తు చేసుకోవాలని జాతీయ మీడియాకు కూడా అభ్యర్ధిస్తున్నాను..సనాతన ధర్మాన్ని ముట్టుకున్నావారు మాడిమసైపోతారు.’’ అరి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Varahi Decleration: వారాహి డిక్లరేషన్.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
Sanathana Dharma: సనాతన ధర్మం గురించి పవన్ కీలక ఉపన్యాసం
Tirupati Varahi Sabha: ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కీలక వ్యాఖ్యలు
Devara Collections: బాక్స్ బద్దలు కొట్టిన దేవర.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..
Pawan Kalyan: 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధి రాలేదు
