Devara Collections: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం దేవర (Devara). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించి అలరించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దేవర పార్ట్ వన్ చిత్రానికి ఇండియా వ్యాప్తంగా భారీ ప్రేక్షకాదరణ దక్కింది.
అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలై తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ (Devara Collections) దక్కించుకుంది. అదరిపోయే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మొదటి రోజు రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.396 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.
ఈ విషయాన్ని దేవర చిత్ర బృందం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో వసూళ్లపరంగా పుంజుకుంది. కేవలం 6 రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.207.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని తెలిపింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే రూ.45.87 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. మొదటి వారంలోనే రూ.300 కోట్ల మార్క్ దాటిపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదే ఊపులో రూ.500 కోట్ల కలెక్షన్లు దాటేయాలని కోరుకుంటున్నారు.
Read also: Devara Review: దేవర సినిమా రివ్యూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ ఎలా ఉందంటే..
Devara: రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన కథానాయిక ఎవరో తెలుసా?
Jr NTR: తమిళ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్
Janhvi Kapoor: ఐఫాలో జాన్వీ కపూర్ ఐ ఫీస్ట్.. ఆ నెక్లెస్ ఎన్ని కోట్లంటే..
