Varahi Decleration: ఏ ధర్మానికి, మతానికి భంగం వాటిల్లినా.. ఒకే విధంగా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలని పవన్ కల్యాణ్ అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం (Varahi Decleration) అవసరం ఉందన్నారు. తిరుపతి వారాహి బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పడాలన్నారు. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయించాలన్నారు.
’’ఆలయాల్లో, నిత్యం జరిగే నైవేధ్యాలు, ప్రసాదాల్లో వినియోగించే స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలగానే కాకుండా.. విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యవరణ పరిరక్షణ కేంద్రాలు, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ప్రణాళిక చేయాలి.
మీరు చేత్తో లడ్డూ చుట్టారని మేము అంటున్నామా? తిరుమల లడ్డూ ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లేదు.. ఆ మాట ఎక్కడ చెప్పలేదు.. గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకుంటున్నారు.. తప్పు జరిగింది, ప్రాసిక్యూట్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం అంటున్నారు.. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం.. దేన్ని డైవర్ట్ చేస్తున్నాం ఇప్పుడు..
సుప్రీంకోర్టుకు వెళ్లాడు పెద్దమనిషి.. ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు.. ఎన్ని వేల కోట్లు దోచేశారో మీకు తెలుసు.. ఎంతమంది జడ్జీలను తిట్టారో మీకు తెలుసు.. సాక్షాత్తూ సుప్రీంకోర్టు జడ్జీలను తిట్టే వ్యక్తి.. ఈరోజు అమాయకంగా వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చచ్చిపోతాం… హారతి వెలిగించుకుంటాం అంటే.. డ్రామాలు చేయకండి అమ్మా.. ఒకటే పనిష్మెంట్ ఉంటుంది.. ఆయన చెప్తాడు..నిజరూప దర్శనం జరిగినప్పుడు తెలుస్తుంది..
ధర్మారెడ్డి ఎక్కడా? ఎక్కడికి మాయం అయిపోయారు? మీరు బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు.. మీరు వచ్చారు.. ఆచారం పాటించలేని వ్యక్తి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు..2005లో మీమీద చాలా ఆరోపణలు ఉన్నాయి అవి కూడా బయటకు తీసుకొస్తాం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
వారాహి డిక్లరేషన్
1)ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
2)సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి.
3)సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి.
4)సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5)సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6)ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
7)ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.
ఇవీ చదవండి: Sanathana Dharma: సనాతన ధర్మం గురించి పవన్ కీలక ఉపన్యాసం
Tirupati Varahi Sabha: ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధి రాలేదు
Devara Collections: బాక్స్ బద్దలు కొట్టిన దేవర.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..
Pawan Kalyan: ఒకే రోజు 13,326 గ్రామ సభలు.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
