The Goat: తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది గోట్’ (The Goat). వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ యాక్షన్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి అలరించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
ఇప్పుడీ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ లేటెస్ట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది అవైలబుల్ ఉంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాలో త్రిష అతిథి పాత్రలో నటించారు.
అధికారిక Instagram ఖాతాలో GOAT డిజిటల్ రిలీజ్ ను నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. యాక్షన్ చిత్రం అక్టోబర్ 3, 2024 నుండి ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతుందని తెలిపింది. “సింహం G.O.A.T అవ్వడం ఎప్పుడైనా చూసారా?! దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అక్టోబర్ 3న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ & హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది. #TheGOATONNetflix,” అనే పోస్ట్ నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ చిత్రం బహుళ భాషలలో చూడటానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. విజయ్ మరొక విజయ్‌ను చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఆయన ఇందులో ద్విపాత్రాభినయం చేశారు.
Read also: Vijay: సమానత్వాన్ని బలంగా సమర్థిస్తాం.. పార్టీ లోగో, ఫ్లాగ్ ఆవిష్కరణలో హీరో విజయ్
Vijay Deverakonda on marriage: పెళ్లయ్యాక నా భార్యతో ఇలా ఉండాలనుకుంటున్నా.. విజయ్ దేవరకొండ కామెంట్స్
Srinu Vaitla: ఆగడు మూవీ చేయాల్సింది కాదు: దర్శకుడు శ్రీనువైట్ల
Pooja Hegde: విజయ్ సరసన పూజాహెగ్డే కన్ఫం?
