HomeAndhra PradeshConstable Jobs: ఏపీలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ.. 5 నెలల్లో పూర్తికి కసరత్తు

Constable Jobs: ఏపీలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ.. 5 నెలల్లో పూర్తికి కసరత్తు

Constable Jobs: గత ప్రభుత్వంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆగిపోయిందని, మళ్లీ మొదలు పెట్టినట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. ప్రైమరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో దేహదారుఢ్య పరీక్షలు, శారీరక కొలతలు (పీఎంటీ, పీఈటీ)కు వారం రోజుల్లో అప్లికేఫన్లు స్వీకరిస్తామని తెలిపారు.

పూర్తి వివరాలను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఉంచామని హోంమంత్రి తెలిపారు. పీఎంటీ, పీఈటీ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో తుది రాత పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులను ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తామన్నారు. మొత్తం నియామక ప్రక్రియను 5 నెలల్లో పూర్తి చేస్తామని అనిత తెలిపారు.

రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబర్లో గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందని హోంమంత్రి గుర్తు చేశారు. ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారని, ఆ తర్వాతి దశలో పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ లోగా ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌లు వేశారని చెప్పారు. వారిని తర్వాత దశ పరీక్షలకు అనుమతించాలని కోర్టు రీసెంట్ గా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయ సలహా అనంతరం ఎంపిక ప్రక్రియను ఆగిపోయిన చోట నుంచి మొదలు పెడుతున్నట్లు హోంమంత్రి వెల్లడించారు.

కాగా, అర్ధాంత‌రంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్ర‌క‌టించిన‌ హోం మంత్రి వంగలపూడి అనితకు ఐటీ మంత్రి నారా లోకేష్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష త‌రువాత రిక్రూట్మెంట్ రెండవ దశలో జ‌ర‌గాల్సిన‌ శారీరక ధారుఢ్య పరీక్షలు వేర్వేరు కారణాల‌తో వాయిదా ప‌డ‌టం వ‌ల్ల తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను `ప్ర‌జాద‌ర్భార్‌`కు వ‌చ్చిన నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.

వీరి విన‌తిని ప‌రిశీలించాల‌ని హోం మంత్రికి పంప‌గా, ఆమె సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ ప్ర‌క్రియ‌లో త‌రువాత ద‌శ‌లు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారన్నారు. ఇది కానిస్టేబుల్ అర్హ‌త ప‌రీక్ష పాసైన నిరుద్యోగుల‌కు చాలా సంతోష‌క‌ర‌మైన స‌మాచారం అని లోకేష్ తెలిపారు.

Read also: Andhra Pradesh: నేరం ఏదైనా.. నిందితులు మాత్రం ఇరు పార్టీల్లో ఎలా ఉంటారు!?
Jobs: టెక్నాలజీ పెరిగినా ఈ రంగాల్లో మెండుగా ఉద్యోగాలు!
Job Calendar: తెలంగాణలో జాబ్ కేలండర్ రిలీజ్.. ముఖ్యాంశాలు ఇవీ..
Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల
AP DSC New Schedule: ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు.. మార్చి 20వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు