HomeTelanganaTelangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల

Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల

Telangana DSC Results: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 పోస్టుల భ‌ర్తీకి జూలై 18వ తేదీ నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు డీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వహించారు. మొత్తం 2.45 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు డీఎస్సీ ఎగ్జామ్స్ రాశారు.

తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం https://tgdsc.aptonline.in/ లింక్‌ను క్లిక్‌ చేయండి

డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. తక్కువ సమయంలో ఫలితాలు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్‌ ఉంటుందని రేవంత్ చెప్పారు. దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు అభ్యర్థులకు అందిస్తామని హామీ ఇచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని రేవంత్ ఆరోపించారు. 10 ఏళ్లలో 7,000 టీచర్‌ పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారన్నారు. తాము 56 రోజుల్లో డీఎస్సీ విడుదల చేశామని రేవంత్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు.

పోస్టులు
2,629 స్కూల్‌ అసిస్టెంట్‌
727 భాషా పండితులు
182 పీఈటీలు
6,508 ఎస్జీటీలు
220 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్లు
796 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీలు

మొత్తం 2,79,957 మంది తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు. 2,45,263 మంది పరీక్షలు రాశారు. దాదాపు 34,694 మంది పరీక్షలు రాయలేకపోయారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు 92.10 శాతం మంది పరీక్షలు రాయడం విశేషం.

ఇవీ చదవండి: CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth on Auto drivers: ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం.. వారి కోసం ఏం చేస్తారంటే..
Anjeli Luvania: పంజా బ్యూటీ హాట్ పోజులు.. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
Janhvi Kapoor: ఐఫాలో జాన్వీ కపూర్ ఐ ఫీస్ట్.. ఆ నెక్లెస్ ఎన్ని కోట్లంటే..
Job Calendar: తెలంగాణలో జాబ్ కేలండర్ రిలీజ్.. ముఖ్యాంశాలు ఇవీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు