Hyderabad: న్యూడ్ ఫొటోలు కావాలంటూ గుర్తు తెలియని దుండగుడు ఐటీ నిపుణుడి (29)కి సినిమా చూపించిన ఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలిలోని ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తికి జూలైలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇన్ స్టా వేదికగా సందేశం పంపించి పరిచయం అయ్యాడు. బర్త్ డే విషెస్ చెప్పేందుకు అని ఫోన్ నంబర్ తీసుకున్నాడు.
అప్పుడప్పుడూ కాల్స్ చేస్తూ సతాయించేవాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇన్ స్టాలో అసభ్యకర రీతిలో ఛాటింగ్ చేస్తూ న్యూడ్ ఫొటోలు పంపించాలంటూ వేధింపులకు గురి చేశాడు. సోషల్ మీడియా, ఫోన్ నంబర్లు బ్లాక్ చేయడంతో వేర్వేరు నంబర్ల నుంచి వేధింపుల పర్వం కొనసాగించాడు. అన్ బ్లాక్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.
ఇక చేసేది లేక అన్‌బ్లాక్ చేయడంతో మళ్లీ వేధింపులు షురూ చేసేవాడు. తాను చెప్పినట్లుగా వినాలని, అసభ్యంగా మాట్లాడాలని హింసించేవాడు. ఐటీ నిపుణుడి ఫాదర్, బ్రదర్స్ కు ఫోన్లు చేసి మీ అబ్బాయి ఫ్రెండ్ నని, సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడంటూ మాట్లాడాడు. ఇక చేసేది లేక సదరు బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దుండగుడి చేష్టలు అరికట్టాలని, చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశాడు.
Read also: PV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్ పై రఘురామ ఫిర్యాదు
Andhra Pradesh: చీప్‌గా లిక్కర్ ఇస్తూ.. మాన్పించాలని చూస్తున్నారట!
CM Chandrababu: జే బ్రాండ్స్ తెచ్చి ప్రజల ప్రాణాలు తీసిన జగన్: చంద్రబాబు
Jobs: టెక్నాలజీ పెరిగినా ఈ రంగాల్లో మెండుగా ఉద్యోగాలు!
Idiot Syndrome: సొంత వైద్యం కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారా? ఇడియట్ సిండ్రోమ్ గురించి తెలుసా?
