HomeAndhra PradeshChandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారి 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు సంకల్పం తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పారిశుధ్య కార్మికులు స్వచ్ఛ సేవకులని, వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. తక్కువ చేసి ఎవరూ మాట్లాడకూడదన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం మచిలీపట్నంలో పర్యటించారు. విద్యార్థులతో కలిసి చెత్తను ఊడ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే..

‘జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ దేశమంతా కదిలించారు…అహింసా పద్ధతిలో పోరాడారు. ఆయన సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం. గాంధీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామంటే అందుకు కారణం ప్రజాహితమైన ఆయన ఆలోచనలే. 1919లో గాంధీజీ మొదటిసారి కృష్ణా జిల్లాలో నిర్వహించిన సత్యాగ్రహ సభలో పాల్గొన్నారు. 1921లో అఖిల భారత మహాసభల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ గడ్డపై పుట్టిన పుట్టిన పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ జెండాను గాంధీజీకి అందించారు.

స్వాతంత్ర్య ఉద్యమం, పోరాటంలో పింగళి వెంకయ్య ముందుండి పోరాడారు. ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకునే శక్తిని ఇచ్చిన పింగళి వెంకయ్య ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం. స్వాతంత్ర్య పోరాటానికి ఊతమిచ్చిన ప్రాంతమిది. ఆంధ్ర జాతీయ కళాశాలలో ఎందరో మహానుభావులు విద్యనభ్యసించారు…కానీ కొందరు స్వార్థపరులు ఆ కాలేజీని కబ్జా చేయాలని చూశారు. మహనీయుల స్ఫూర్తిని కాపాడతాం. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వ ఆదీనంలో నిర్వహిస్తాం. పింగళి వెంకయ్య పేరుతో మెడికల్ కాలేజీ నిర్మిస్తాం’

చెత్తపన్ను రద్దు

‘సమైఖ్యరాష్ట్రంలో 1998లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించాం. ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నా మనసుకు దగ్గరగా ఉంటుంది. అందరం ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం. 2014, అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు…ఇది అభినందనీయం. అక్టోబర్ 2న స్వచ్ఛ సేవకులకు అవార్డులు ఇచ్చి, వారిని అభినందించాలని గతంలో ప్రతిపాదించాం. 2015లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఏపీకి శ్రీకారం చుట్టాం. 2019కి ముందు పట్టణాల్లో డివైడర్లకు రంగులు వేసి, పార్కులు అభివృద్ధి చేశాము. కానీ 2019లో భూతం వచ్చి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.

ఎక్కడ చూసినా కుప్పలుగా చెత్తను పెట్టారు. చెత్తతో సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కంపోస్ట్ ఎవరువుల తయారు చేసి పంటలకు ఉపయోగించి ఎక్కడా చెత్త కనబడకుండా చేశాం. పట్టణాల్లో 2.43 లక్షల మరుగుదొడ్లు, 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించి 110 మున్సిపాలిటీలను ఓడీఎఫ్ గా ప్రకటించాం. గత పాలకుల నిర్వాకం కారణంగా రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా ఉంది. 365 రోజుల్లో ఆ చెత్తంతా తొలగించాలని మంత్రి నారాయణను ఆదేశిస్తున్నా.

చెత్తపై పన్ను వేశారు తప్ప…చెత్త సరిగా తొలగించలేదు. చెత్తపై గత ప్రభుత్వం వేసిన పన్నును రద్దు చేస్తున్నాం. వచ్చే కేబినెట్ లో ఆమోదించి రద్దు చేస్తాం. నాడు గ్రామాల్లో 41.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించాము. 2018లో ఓడీఎఫ్ రాష్ట్రంగా ప్రకటించాం. 9,538 సాలిడ్ వేస్టే మేనేజ్ మెంట్ కేంద్రాలను నిర్మించాం…కానీ వాటిని గత ప్రభుత్వం వినియోగించుకోకుండా రంగులు వేసుకుంది. విజయవాడ, గుంటూరులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. భవిష్యత్ లో ఎన్ని ప్లాంట్లు అవసరమవుతాయో ఏర్పాటు చేస్తాం. ప్రతి రోజూ విధిగా చెత్తను తొలగిస్తాం. టెక్నాలజీ ఉపయోగగించి భవిష్యత్తులో ఎక్కడా చెత్త లేకుండా చేస్తాం. పూడి పోయిన డ్రెయిన్లు డ్రోన్లతో గుర్తించి వదర సమయంలో క్లీన్ చేయించాం.’

2025 నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి

‘మచిలీపట్నం మంచి సిటీ…బ్రిటిష్ వారి సమయంలో ఓ వెలుగు వెలిగింది. 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు నిర్మిస్తాం. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోర్టు దుర్మార్గుల నిర్లక్ష్యంతో వెనక్కిపోయింది. బందరు పోర్టు పూర్తైతే ఇక్కడి వాసులకు అనేక లాభాలు కలుగుతాయి. బందరు నుండి రేపల్లెకు రైల్వే లైను ఏర్పాటుకు చొరవ తీసుకుంటాం. మచిలీపట్నంలో డ్రెయినేజీ 100 శాతం మంచిగా ఉండేలా చేస్తాం. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేస్తాం. డంపింగ్ యార్డు క్లీన్ చేస్తాం. బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం. మచిలీపట్నం బీచ్ ను స్వదేశీ దర్శనం పథకం కింద అభివృద్ధి చేస్తాం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఇవీ చదవండి: CM Chandrababu: జే బ్రాండ్స్ తెచ్చి ప్రజల ప్రాణాలు తీసిన జగన్: చంద్రబాబు
Margani Bharath: పోలవరం పనుల్లో చంద్రబాబు చారిత్రక తప్పిదం: మార్గాని భరత్
Purandeswari: చంద్రబాబుపై సుప్రీంకోర్టు కామెంట్లు సమంజసం కాదు: పురందేశ్వరి
Supreme court on Tirumala Laddu: సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
CM Chandrababu: క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాలి: చంద్రబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు