Pawan Kalyan: శ్రీవారి దర్శనం అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విరమించారు. వారాహి డిక్లరేషన్ బుక్ తో ఆలయం వెలుపలకు పవన్ వచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో భక్తులు ఆసక్తిగా గమనించారు. కాలినడక సమయంలో పవన్ వెంట డిక్లరేషన్ పుస్తకం తెచ్చుకున్నారు. స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు పుస్తకాన్ని పవన్ వెంట తీసుకెళ్లారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి పవన్ కల్యాణ్ వెళ్లారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల కొండ మెట్లు ఎక్కడానికి చాలా కష్టపడ్డారు. అలిపిరి మెట్లమార్గం నుంచి 4.45 గంటలకు ప్రారంభించిన నడక.. దాదాపు 5 గంటలపైనే కొనసాగింది. రాత్రి 9.20 గంటలకు పవన్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. నడకదారిలో పవన్ బాగా అలిసిపోయారు. నడవడానికి ఇబ్బందులు పడ్డారు. దారిపొడవున కూర్చుంటూ వచ్చిన ఆయనకు పక్కనున్న వారు సపర్యలు చేశారు.
మరోవైపు తిరుమలలో పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజని కొణిదెల డిక్లరేషన్ ఇచ్చింది. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కుమార్తె సంతకాలు చేసింది. పొలెనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ సంతకాలు చేశారు.
ఇవీ చదవండి: Gold rates today 02-10-2024: దసరా ముంగిట పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Pawan Kalyan: ఒకే రోజు 13,326 గ్రామ సభలు.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
Akira nandhan: పవన్‌తో కలిసి అకీరా నందన్ మోదీని కలవడంపై రేణు ఎమోషనల్
Modi Pawan Kalyan: జనసేనానిపై మోదీ పొగడ్తలు.. పవన్ కాదు.. తుఫాన్
Perni Nani: కూటమి కకావికలం.. మోదీ, పవన్ ఫొటోలు ఏవీ?: పేర్ని నాని విమర్శలు
