Andhra Pradesh: ఏపీలో కొత్త మద్యం విధానం తీసుకొచ్చిన చంద్రబాబు సర్కార్.. లిక్కర్ ధరలు తగ్గించి అందుబాటులోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. తాజాగా నూతన మద్యం విధానం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. ఈనెల 12వ తేదీ నుంచి కొత్త ప్రయివేటు మద్యం దుకాణాలను తెరవనుంది.
దీంతో 2019కి ముందున్న మద్యం దుకాణాలే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కానున్నాయి. ఇదిలా ఉంటే.. ధరలు తగ్గించి చీప్ గా మద్యం అందుబాటులోకి తెస్తున్న సీఎం చంద్రబాబు.. మరోవైపు మద్యం మాన్పించాలని ప్రయత్నిస్తున్నామంటూ నిన్న కామెంట్స్ చేశారు. దీంతో ఓవైపు తక్కువ ధరకే మద్యం ఇస్తూ, మరోవైపు మాన్పించడం ఎలా సాధ్యమంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వాస్తవానికి గత జగన్ ప్రభుత్వం.. మద్యం అంటేనే అసహ్యం వేసేలా కొన్ని ప్రయత్నాలు చేసింది. కల్తీ మద్యం అని, రేటు భారీగా పెరిగిందని జనంలో ఏహ్య భావవం వచ్చేలా చేశారు. ధరలు షాక్ కొట్టేలా పెంచుతామని చెప్పినట్లుగానే చేశారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 లిక్కర్ షాపులు ఉండేవి. జగన్ ప్రభుత్వం వచ్చాక దశల వారీగా వాటిని 2,934కు తగ్గించారు. మద్యం దుకాణాల విక్రయ వేళలు కుదిస్తూ ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే నడిపారు. 4,380 పర్మిట్ రూమ్‌లు రద్దు చేశారు. 43,000 బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగించారు. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వడం ఆపేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలు 2,934 ఉన్నాయి. వాటిని ప్రభుత్వ పరిధి నుంచి తప్పిస్తూ మొదటి దశలోనే 3,396 దుకాణాలకు కూటమి ప్రభుత్వం పెంచింది. అయితే, మద్యం దుకాణాల లాటరీ విధానంలో కూటమి నేతలు సింటికేట్ గా మారారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేరే ఎవరూ లాటరీలో పాల్గొనకుండా ఒత్తిళ్లు తెస్తున్నారని, పాల్గొని దక్కించుకుంటే తప్పనిసరిగా 50 శాతం వాటా ఇవ్వాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మొన్నటి దాకా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేసిన సిబ్బంది పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తమ ఉద్యోగాలను అర్ధంతరంగా తొలగించిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 మంది తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.
నూతన మద్యం విధానం ముఖ్యాంశాలు..
* ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ.
* ఈ నెల 11న లాటరీ విధానంలో లైసెన్సుల కేటాయింపు.
* ఈ నెల 12 నుంచి 3,396 ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటు.
* వాటికి అదనంగా 12 స్మార్ట్ స్టోర్స్ ఏర్పాటు. వీటికి ఏడాదికి రూ.కోటి లైసెన్స్ ఫీజుగా ఐదేళ్ల కాలపరిమితి.
* తర్వాతి దశల్లో మరిన్ని మద్యం దుకాణాలు, స్మార్ట్ స్టోర్స్‌ను అనుమతించాలని నిర్ణయం.
* మద్యం దుకాణాల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహణ.
* మంగళవారం ఉదయం నుంచి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ మొదలైంది.
* 10 వేల మంది లోపు జనాభా ఉంటే లైసెన్సు ఫీజు రూ.50 లక్షలు.
* 10 వేల నుంచి 50 వేల మంది వరకు జనాభా ఉంటే ఫీజు రూ.55 లక్షలు.
* 50,001 నుంచి 5 లక్షల జనాభా వరకు ఉంటే లైసెన్సు ఫీజు రూ.65 లక్షలు.
* 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు.
ఇవీ చదవండి: AP Liquor Policy: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త మద్యం షాపులు
AP Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ
Prannoy Roy Interview with YS Jagan: వైయస్ జగన్‌తో ప్రణయ్ రాయ్ ఇంటర్వ్యూ.. అభివృద్ధి, మద్యం పాలసీపై క్లారిటీ!
CM Chandrababu: జే బ్రాండ్స్ తెచ్చి ప్రజల ప్రాణాలు తీసిన జగన్: చంద్రబాబు
YS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్
