HomeCinemaBigg Boss 8: బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే..

Bigg Boss 8: బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే..

Bigg Boss 8: రానురానూ బిగ్‌బాస్ 8.. మరీ ఆసక్తి లేకుండా సాగుతోందన్న విమర్శల నేపథ్యంలో నిర్వాహకులు కాస్త మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల సోనియా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తదనుగుణంగానే ఈసారి నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది అత్యంత ఆసక్తికరంగా మారిపోయింది.

ఇక కొన్నిరోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి నెట్టింట పలు వార్తలు, గాసిప్స్ ప్రచారం జరుగుతున్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పుడు తొలి కంటెస్టెంట్ ఎవరో చెప్పుకోండి చూద్దాం.. అంటూ నిర్వాహకులు నీడతో ఉన్న పిక్చర్ విడుదల చేశారు. అయితే ఇది గత సీజన్‌లో పాల్గొన్న టేస్టీ తేజనే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తేజతో పాటు ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, యాంకర్ రవి, నయని పావని.. ఇలా పలువురు పేర్లను కామెంట్లలో పెడుతున్నారు. వీళ్లలో ఎవరు వస్తారనేది ఈ వీకెండ్ లేదంటే వచ్చే వీకెండ్ కల్లా తేలనుంది.

మరోవైపు మంగళవారం ఎపిసోడ్‌లో ‘జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు’ అనే టాస్క్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వదిలారు. తొలుత ఈ టాస్క్‌ ఎవరు ఆడాలి? అనే విషయమై కాంతార క్లాన్‌లో చాలా చర్చ నడిచింది. నామినేషన్స్‌లో ఉన్నామని చెప్పి నైనిక బతిమాలింది. ప్రేరణకు హెల్త్ బాలేదని, సీత చీఫ్ కాబట్టి సేఫ్ అంటూ.. చివరికి మణికంఠను ఈ టాస్క్‌లో పెట్టారు. మరోవైపు యష్మి కూడా పోటీ ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు? నిలిచేదెవరు? చివరకు ఏమైందో తెలుసుకోవాలంటూ పూర్తి ఎపిసోడ్ చూసేయండి.

Read also: Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ చిచ్చు.. ఐదో వారంలో నామినేషన్స్‌లో ఎవరున్నారంటే..
Bigg Boss 8 Telugu: గర్ల్ ఫ్రెండ్ ను ఇంట్రడ్యూస్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ నబీల్
Bigg Boss 7 : బిగ్‌ బాస్‌ 7 గ్రాండ్‌ ఓపెనింగ్‌.. వచ్చీ రాగానే నాగ్‌ ఏం చేశాడంటే..
Anjeli Luvania: పంజా బ్యూటీ హాట్ పోజులు.. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
Ananya Panday: దక్షిణాదిపై అనన్య ఫోకస్.. ఉపాసన కీ కామెంట్స్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు