Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురి పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వై వి సుబ్బారెడ్డి అభ్యర్థన చేశారు. ఎన్ డి డిబి ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని పిటీషన్ లో కోరారు. సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు.
తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎక్కడిదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా ? అనేది తేల్చాలని పిటిషన్ లో కోరారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచారని పిటిషన్ లో ప్రస్తావించారు.
ఎస్ఓపి ప్రకారం పరీక్షల్లో నెగ్గిన నెయ్యిని తిరుమల ప్రసాదానికి వాడడం దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానం అని వెల్లడించారు. ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రస్తావించారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషన్ లో కోరారు.
Tirumala: కలి ప్రభావం.. అప్పుడే ఏమైంది..? ఇంకా మున్ముందు చాలా చూడాలి భక్తులారా…!
YS Jagan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైయస్సార్ సీపీ
Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు
