Anjeli Luvania: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన పంజా చిత్రంలో నటించిన అంజలి లావానియా.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ పోజులిస్తోంది. పవన్ ఆ మూవీలో స్టైలిష్ లుక్స్ తో కనిపించి యూత్ ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 2011 లో విడుదలైన ఈ మూవీకి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఆ చిత్రానికి హైలెట్.
ఈ సినిమాలోని పాటలు కూడా హిట్ లిస్టులో చేరాయి. జాకీ ష్రాఫ్, అడివి శేష్, అలాగే అతుల్ కులకర్ణిల నటన చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నప్పటికీ ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. పవన్ సరసన సారా-జేన్ డయాస్, మరో హీరోయిన్ గా అంజలి లావానియా నటించి మెప్పించారు.
అంజలి పంజాలో హాట్ గా కనిపించి అలరించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన అంజలి ఇప్పుడేం చేస్తోందన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తక మానదు. మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు కేవలం ఒకే ఒక్క సినిమానే చేసింది. 2012లో ఆమె వోగ్ టాప్ 10 మోడల్స్ జాబితాలో చోటు దక్కించుకుంది.
పలు అందాల పోటీల్లోనూ అంజలి పాల్గొంది. చక్ర హీలింగ్ లోని క్రియా యోగా వైద్యం చేసే కళలను నేర్చుకోవడానికి, మోడలింగ్, నటన నుంచి విరామం తీసుకుంది. ఇప్పుడు నటనకు పూర్తిగా దూరంగా ఉంది. కానీ డీజే గా మారి ప్రేక్షకులను మైమరపిస్తోంది. నెట్టింట ఈ అమ్మడి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Bigg Boss 8 Telugu: గర్ల్ ఫ్రెండ్ ను ఇంట్రడ్యూస్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ నబీల్
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫొటో గ్యాలరీ..
Janhvi Kapoor: ఆ హీరోను యాంగ్రీ యంగ్ మ్యాన్‌తో పోల్చిన జాన్వీ
Vantalakka: ఇది చూశారా.. వంటలక్క ఆస్తులు ఎన్ని కోట్లంటే..
