HomeAndhra PradeshTirumala Laddu Row: కల్తీ నెయ్యిపై మూడు రోజుల పాటు సిట్ విచారణ

Tirumala Laddu Row: కల్తీ నెయ్యిపై మూడు రోజుల పాటు సిట్ విచారణ

Tirumala Laddu Row: తిరుమలలో లడ్డూల తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సిట్ పనిని ప్రారంభించింది. ఇవాళ సిట్ అధికారులు తిరుపతికి చేరుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై విచారణ మొదలు పెట్టారు.

సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఇతర సభ్యులు తిరుపతి, తిరుమలలో పర్యటించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహనికి త్రిపాఠి చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

తిరుమల చేరుకున్న సిట్ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. కమిటీకి నేతృత్వం వహిస్తున్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు, డీఎస్పీలు సీతారామారావు, శివ నారాయణ స్వామి, సీఐలు సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శన అనంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల వైభోవత్సవ మండపం వద్ద సహస్ర దీపాలంకరణ సేవ ఉత్సవమూర్తులను త్రిపాఠి దర్శించుకున్నారు.

తిరుమల నుంచి బయలుదేరిన సిట్ సభ్యులు, తిరుపతిలోని పోలీసు అతిథిగృహంలో సమావేశం అయ్యారు. విచారణ కార్యాచరణపై చర్చించారు. మూడు రోజుల పాటు సిట్‍ బృందం తిరుపతి, తిరుమలలో విచారణ జరుపుతుంది.

ఇవీ చదవండి: YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం? 
YS Jagan: వైయస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనం వేళ డిక్లరేషన్ వివాదం
YS Jagan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైయస్సార్ సీపీ
Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు