Ram Charan Daughter: మెగా ఇంట ప్రిన్సెస్.. కుమార్తెకు జన్మనిచ్చిన ఉపాసన

Ram Charan Daughter: మెగాస్టార్‌ ఇంట మహాలక్ష్మి అడుగు పెట్టింది. రామ్‌ చరణ్‌, ఉపాసన (Upasana) దంపతులకు (Ram Charan Daughter) ప్రిన్సెస్‌ వచ్చేసింది. మంగళవారం వేకువజామున పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. ఈ మేరకు అపోలో ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పెళ్లయిన తర్వాత పదేళ్లకు సంతానం కలగడంతో మెగా ఇంట సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఉపాసన ప్రెగ్నెన్సీ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదటిసారిగా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాత అవుతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని ఆయన మురిసిపోయారు.

మెగా కుటుంబంలో ప్రిన్సెస్ (Mega Princes) అడుగు పెట్టిందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉపాసన, రామ్‌ చరణ్‌ దంపతులకు పుట్టబోయే బిడ్డ కోసం యువ సంగీత దర్శకుడు, సింగర్‌ కాలభైరవ ప్రత్యేక ట్యూన్‌ను రూపొందించాడు. ఈ ట్యూన్‌ వినసొంపుగా ఉందంటూ రామ్‌చరణ్‌ మెచ్చుకున్నారు. చక్కటి ట్యూన్‌ను తమ బిడ్డ కోసం రూపొందించినందుకు కాల భైరవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఉపాసన, రామ్‌ చరణ్‌ దంపతులు.

ట్విట్టర్‌ ద్వారా ఈ ట్యూన్‌ను రామ్‌ చరణ్‌ పంచుకున్నారు. ఈ ట్యూన్‌ తమ కోసం ప్రత్యేకంగా తయారు చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పారు. ఈ భూమ్మీద లక్షల మంది చిన్నారుల్లో ఈ మెలోడీ ట్యూన్‌ సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నట్లు రామ్‌ చరణ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక సినిమాల్లో బిజీగా ఉంటున్న రామ్‌ చరణ్‌.. ఉపాసన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు నెలలపాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. భార్య, పాప వద్ద ఉంటూ కేర్‌ తీసుకోవాలని భావిస్తున్నారట. ఉపాసన, తన బిడ్డకు పూర్తి సమయం కేటాయించేలా ప్లాన్‌ చేశారని టాక్‌ వినిపిస్తోంది. అయితే, దీనిపై రామ్‌ చరణ్‌ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సినిమా టెన్షన్లు ఎప్పుడూ ఉండేవేనని, తమ బిడ్డకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వాస్తవానికి గత నెల రోజుల నుంచి రామ్‌ చరణ్‌ షూటింగ్‌లకు దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఆగస్టు దాకా రామ్‌ చరణ్‌ షూటింగ్‌లలో పాల్గొనే చాన్స్‌ లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామ్‌ చరణ్‌ నటించనున్న గేమ్‌ ఛేంజర్‌ (Game Changer Movie) మూవీ కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. మరోవైపు RC15 మూవీ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక గేమ్‌ ఛేంజర్‌ మూవీ కోసం అభిమానుల ఎదురు చూపులు తప్పేటట్లు లేవని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఉపాసన, రామ్‌ చరణ్‌ దంపతులకు పండంటి బిడ్డ జన్మించడంతో మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇక చిరంజీవి అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Read Also : Sharwanand: ఓ ఇంటివాడైన శర్వానంద్‌.. రక్షితా రెడ్డి బ్యాగ్రౌండ్ ఇదే..

Read Also : NTR: రామ్ చరణ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ త్యాగం!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles