HomeLife StyleLifestyle: మనిషి రోజుకు ఎన్ని గంటలు నిల్చుకోవాలి? కూర్చోవాలి?

Lifestyle: మనిషి రోజుకు ఎన్ని గంటలు నిల్చుకోవాలి? కూర్చోవాలి?

Lifestyle: కాలం మారుతున్న కొద్దీ మనిషి జీవన శైలిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చేసే పని, తినే ఆహారం, నిద్ర వేళలు చేంజ్ అయిపోతున్నాయి. ప్రాసెస్డ్‌ ఆహారాలు ఎక్కువ తీసుకోవడం, ఫిజికల్‌ యాక్టివిటీ, నిద్రపోయే సమయం బాగా తగ్గడంతో పలు రకాల సమస్యలు వస్తున్నాయి. గుండెపోటు, ఊబకాయం, మధుమేహం ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. ఈ ముప్పును తగ్గించుకోవడానికి మన ముందున్న అతి పెద్ద ప్రణాళిక వీలైనంత ఎక్కువగా శారీరక శ్రమ చేయడమే.

రోజులో ఎక్కువ గంటలు కూర్చుని పని చేసేవాళ్లు, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మందికి రోజులో ఫిజికల్ యాక్టివిటీకి ఎంత సమయం కేటాయించాలన్నది తెలియదు. ఎంత సమయం నిలబడాలి, ఎంత సమయం కూర్చోవాలన్న సందేహాలుంటాయి. వీటికి ఇటీవల ఆస్ట్రేలియన్ స్టడీ ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

ఫిజికల్ యాక్టివిటీ
ఒక వ్యక్తి రోజులో లైట్, మోడరేట్‌, ఇంటెన్స్‌ ఫిజికల్‌ యాక్టివిటీలు 4 గంటలు ఉండాలట. కనీసం 8 గంటల నిద్ర అవసరం. లైట్‌-మోడరేట్ ఫిజికల్‌ యాక్టివిటీలలో పనులు చేయడం నుంచి రాత్రి భోజనం చేయడం వరకు ఉంటాయి. మోడరేట్‌-ఇంటెన్స్‌ యాక్టివిటీలలో ఇంటెన్షనల్ మూవ్‌మెంట్, చురుకైన నడక లేదా జిమ్ ఎక్సర్‌సైజ్‌ వంటి ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆస్ట్రేలియాలోని స్విన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం 24 గంటల వ్యవధిలో 2,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రవర్తనను విశ్లేషించింది. కావాల్సిన ఆరోగ్యం కోసం కూర్చోవడం, నిద్రపోవడం, నిలబడడం, శారీరకంగా చురుకుగా ఉండటం వంటి సమయాన్ని నిర్ణయించింది. రోజులో 4 గంటల ఫిజికల్ యాక్టివిటీ, 8 గంటల నిద్ర, 6 గంటలు కూర్చోవడం, 5 గంటలు నిలబడి ఉండాలని చెబుతోంది.

ఎక్కువ సమయం శారీరకంగా చురుకుగా ఉండటం లేదా లైట్‌-ఇంటెన్సిటీ మూవ్‌మెంట్స్‌ను కూర్చునే సమయంతో ఎక్స్ఛేంజ్‌ చేయడం అనేది మధుమేహం కలిగిన వ్యక్తులకు బెటర్. ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌తో ఫిజికల్ యాక్టివిటీలు ముడి పడి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి: Stress: ఒత్తిడిని జయించడానికి కొత్త మార్గాలు.. వ్యాయామం, యోగాతో పాటు ఇవీ కూడా..!
Exercise: వ్యాయామం చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు చూడొచ్చు? ఏరోబిక్‌తో హెల్తీ లైఫ్‌
Adudham Andhra CM Jagan: ఏటా ఆడుదాం ఆంధ్ర క్రీడలు.. గ్రామస్థాయిలోనే వ్యాయామంపై అవగాహన ఉండాలన్న సీఎం జగన్‌
Diabetes: మధుమేహం ఉందా? రోజూ 45 నిమిషాల పాటు ఇలా చేయండి
Women: 30 ఏళ్ల మహిళల అందానికి చిట్కాలివిగో..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు