HomeAndhra PradeshSeediri Appalaraju: మెడికల్‌ సీట్లు వదులుకోవడం దారుణం: సీదిరి అప్పలరాజు

Seediri Appalaraju: మెడికల్‌ సీట్లు వదులుకోవడం దారుణం: సీదిరి అప్పలరాజు

Seediri Appalaraju: వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌.. పులివెందుల మెడికల్‌ కాలేజీకి సంబంధించి మాట్లాడిన మాటలు విస్మయం కలిగించాయన్నారు.

ఇందుకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ప్రస్తావించారు. దేశచరిత్రలో ఇంత దారుణమైన ప్రకటన చేసిన ఆరోగ్యశాఖ మంత్రి ఏ రాష్ట్రంలో ఉండరన్న ఆయన, బ్రిటిషర్ల కాలంలో కూడా ఇంత చెత్త స్టేట్‌మెంట్‌ ఏ మంత్రి ఇచ్చి ఉండరని ఆగ్రహించారు.

ప్రభుత్వ రంగంలో అదనంగా మెడికల్‌ సీట్లు వద్దని ఏ రాష్ట్రమైనా అంటుందా? అని ప్రశ్నించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని చెత్త పని ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ బాధ్యత వైద్య విద్య ఎక్కువమందికి అందించేలా ఉండాలి కానీ.. మాకు మెడికల్‌ సీట్లు వద్దు.. మీరెందుకు ఇచ్చారని కేంద్రాన్ని ప్రశ్నించడం విడ్డూరమన్నారు.

కాలేజీల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోమని కేంద్రం టైం ఇచ్చి, ఎల్‌వోపీ ఇచ్చి మీరు అండర్‌ టేకింగ్‌ లెటర్‌ ఇస్తే మేం సీట్లు ఇస్తామంటే.. మాకు సీట్లు వద్దన్న ఘనత చంద్రబాబు సర్కార్‌దని మండిపడ్డారు. దీనిపై మేధావులు, విద్యావంతులు, విద్యార్థి లోకం ఆలోచించాలన్నారు. లక్షలాది తల్లిదండ్రులు కూడా దీనిపై స్పందించాలని కోరారు.

ఇవీ చదవండి: Vizag boat Fire Accident: సీఎం జగన్‌ ఉదారత.. బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు 80 శాతం సాయం
YS Jagan: తప్పుడు సంప్రదాయాలు ఆపకుంటే మీకూ ఇదే గతి: వైయస్ జగన్ హెచ్చరిక
Chandrababu Naidu: వైయస్ జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
YS Jagan: రేపు గుంటూరులో వైయస్ జగన్ పర్యటన
Vinayaka Chaviti: తెలుగు వారికి వైయస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు