Diabetes: ఈరోజుల్లో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికీ ఈ వ్యాధి వస్తోంది. నేటి కాలంలో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలు సహా మన బాడీలోని అనేక అవయవాలు దెబ్బతినే చాన్స్ ఉంటుంది.
బ్లడ్ షుగర్ అదుపులో ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచాలంటే ముందుగా స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం ఆపాలి. దాంతో పాటు, ప్రతిరోజూ తగినంత సమయం నడవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే చక్కెరతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే, రోజుకు ఎంత సమయం వాకింగ్ చేస్తే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందన్నది అందరికీ తలెత్తే ప్రశ్న.
నడక మధుమేహ రోగులకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. వాకింగ్ శారీరక వ్యాయామం. ఈ వ్యాయామం చేయడం వల్ల అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. రెండోది వాకింగ్ చేస్తే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. శరీరంలోని కణాలు రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ను వాడుకోవచ్చు. దీంతో చక్కెర స్థాయి తగ్గుతుంది. మధుమేహ రోగులందరూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు.
40 ఏళ్లు పైబడిన తర్వాత కండరాలు క్షీణించడం మామూలుగా జరిగేదే. ఇది చాలా సాధారణ శారీరక ప్రక్రియ. డయాబెటిక్ ఉన్న వారి శరీరం కండరాలను కోల్పోయినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ వ్యాధితో బాధపడేవారు కండరాల బలాన్ని మరింతగా పెంచుకోవాలి. ఇందుకు వాకింగ్ కోసం రోజులో కొంత సమయం తప్పనిసరిగా కేటాయించాలి.
ముప్పావు గంట నడక
బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే రోజులో కనీసం 45 నిమిషాల పాటు నడవాలి. కనీసం 6 వేల అడుగులు వాకింగ్ చేయాలి. అయితే రోజుకు 9 నుంచి 10 వేల అడుగులు నడవగలిగితే.. అప్పుడు మీరు ఎక్కువ లాభం పొందవచ్చు. రోజులో మీరు వాకింగ్ సమయాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోండి. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం తర్వాత 15 నిమిషాలు నడవడం మంచిది. ఇలా చేయడం వల్ల షుగర్‌ని ఈజీగా నింయత్రణలో ఉంచుకోవచ్చు. ఫుడ్ కూడా బాగా జీర్ణం అవుతుంది.
ఇవీ చదవండి: Pawan Kalyan: ఒకే రోజు 13,326 గ్రామ సభలు.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
YS Jagan: వక్ఫ్ బిల్లుకు మేం వ్యతిరేకం.. వైయస్ జగన్ క్లారిటీ
Vijay: సమానత్వాన్ని బలంగా సమర్థిస్తాం.. పార్టీ లోగో, ఫ్లాగ్ ఆవిష్కరణలో హీరో విజయ్
National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ నటుడు రిషభ్
Mister Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ.. 2011-12 తర్వాత సినిమాలు రాలేదా?
