HomeTech NewsJobs: టెక్నాలజీ పెరిగినా ఈ రంగాల్లో మెండుగా ఉద్యోగాలు!

Jobs: టెక్నాలజీ పెరిగినా ఈ రంగాల్లో మెండుగా ఉద్యోగాలు!

Jobs: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ హవా నడుస్తోంది. ప్రతి అంశంలోనూ ఏఐని యూజ్ చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ మరింత పెరిగిపోయి మన ఉద్యోగాలకు ఎసరు పెడుతుందేమోనన్న సందేహం కలగక మానదు. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ ఎంత పెరిగినా ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదట. మీరు ఎంచుకునే రంగాన్ని బట్టి కెరీర్ పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు ప్రకారం 2027 నాటికి ఇండియా జాబ్ మార్కెట్ 22 శాతం మేర మారనుందట. అంటే ఇప్పటి వరకు జనాదరణ పొందిన ఉద్యోగాలు హఠాత్తుగా డిమాండ్ తగ్గుతాయని చెబుతున్నారు. మీరు ఎప్పుడూ వినని ఉద్యోగాలు అకస్మాత్తుగా వెలుగులోకి వస్తాయని సూచిస్తున్నారు. కాబట్టి టెక్నాలజీతో పాటు మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నది నిపుణుల మాట. మీ ఉద్యోగం సురక్షితంగా ఉండే 10 ప్రత్యేక రంగాలు ఇవీ..

1. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్
ఎన్ని వైద్య పరికరాలను ప్రవేశపెట్టినా, ప్రస్తుతం వైద్యులను ఎవరూ భర్తీ చేయలేరు. మెడిసిన్ మాత్రమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ నిపుణులుగా అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వారి సగటు జీతం రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది.

2. డిజిటల్ మార్కెటర్
సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (SEO), సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, డేటా అనలిటిక్స్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో రాణించవచ్చు. వీరి సగటు జీతం రూ.7 లక్షల వరకు ఉంది.

3. డేటా సైంటిస్ట్
పైథాన్, స్కాలా, ఆర్, జావా లాంటి కంప్యూటర్ లాంగ్వేజెస్‌పై మీకు బలంగా పట్టు ఉంటే, ఈ కెరీర్ ఎంపిక మీకు బెస్ట్. ఇందులో సగటు జీతం రూ.14 లక్షల వరకు ఉంది.

4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్
ఈ రంగంలో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, కంప్యూటర్ భాషతో పాటు గణితం, అల్గారిథమ్‌లపై పరిజ్ఞానం కలిగి ఉండటం ముఖ్యం. ఇందులో సగటు జీతం రూ.11 లక్షల వరకు ఉంటుంది.

5. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్
ఈ ఫీల్డ్ కోసం ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్ భాషలపై బలమైన పట్టు ఉండాలి. డేటా భద్రత, నెట్‌వర్కింగ్ ప్రోటోకాల్‌ల గురించి కూడా అవగాహన ఏర్పరచుకోవాలి. వారి సగటు జీతం రూ.5.76 లక్షల వరకు ఉంది.

6. హ్యూమన్ రిసోర్స్ మేనేజర్
హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్‌లో కెరీర్ కు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా రావాలి. మీరు వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలి. నిర్ణయం తీసుకునే ఆర్ట్ కూడా కీలకం. వారి సగటు జీతం రూ.9,10,000 వరకు ఉంటుంది.

7. ఫుల్ స్టాక్ డెవలపర్
HTML, CSS, Java స్క్రిప్ట్‌లపై బలమైన పట్టు ఉన్నవారు ఈ రంగంలో గొప్ప కెరీర్‌ని పొందగలరు. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కూడా తెలుసుకోవడం కీలకం. వారి సగటు జీతం రూ.7,17,000 వరకు ఉంటుంది.

8. క్లౌడ్ డెవలపర్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పాటు లైనక్స్, డెవలప్‌మెంట్, ఆపరేషనల్ స్కిల్స్‌పై కమాండ్ ఉన్నవారు క్లౌడ్ డెవలపర్‌లుగా కెరీర్ లో సెటిల్ కావచ్చు. NASSCOM ప్రకారం 2026 నాటికి ఈ రంగంలో 14 మిలియన్ల ఉద్యోగాలు సృష్టి జరుగుతుందట. వీరి సగటు జీతం రూ.11 లక్షల వరకు ఉంటుంది.

9. ప్రాజెక్ట్ మేనేజర్
మీకు నాయకత్వం, టీమ్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు బాగా ఉంటే ఈ కెరీర్ ఆప్షన్ ఉత్తమం. ఈ రంగంలో పనిచేస్తున్న వ్యక్తుల సగటు జీతం రూ.17 లక్షల వరకు ఉంటుంది.

10. డిజిటల్ కంటెంట్ క్రియేటర్
సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాల ఆధారంగా మీరు గొప్ప డిజిటల్ కంటెంట్ సృష్టికర్త కావచ్చు. వారి సగటు జీతం రూ.8,50,000 వరకు ఉంటుంది. ఇది బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ను పెరుగే అవకాశం ఉంది.

Read Also: Job Calendar: తెలంగాణలో జాబ్ కేలండర్ రిలీజ్.. ముఖ్యాంశాలు ఇవీ..
Endowment Outsourcing Jobs: దేవాదాయ శాఖలో అవుట్ సోర్సింగ్‌పై ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ
AP Jobs: గ్రూప్‌-1, 2 ఉద్యోగార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌ న్యూస్!
UnEmployment: జాబ్‌లెస్‌ లైఫ్.. ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా 8% దాటిన నిరుద్యోగిత రేటు..!
AP Employees: ఏపీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు ?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు