HomeLife StyleSteps: అకాల మరణ ముప్పు తప్పించుకోవాలా? రోజూ మెట్లెక్కి దిగండి చాలు!

Steps: అకాల మరణ ముప్పు తప్పించుకోవాలా? రోజూ మెట్లెక్కి దిగండి చాలు!

Steps: అనేక మంది అనారోగ్య సమస్యల కారణంగా అకాల మరణం పొందుతుంటారు. ఈ క్రమంలో అకాల మరణం నుంచి తప్పించుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా రోజూ మెట్లు ఎక్కి దిగడం వల్ల అకాల మృత్యువు నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు.

ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలంటే శరీరంలోని కీలక అవయవాలు గుండె, కిడ్నీలు, కాలేయం వంటివి సక్రమంగా పనిచేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచి ఆహారం తినడంతో పాటు ప్రతిరోజు శారీరక శ్రమ చేస్తే శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా పని చేస్తాయి. వాటి ఫలితంగా మనిషి ఆయుష్షు పెరిగే చాన్స్ ఉంది. రోజూ మెట్లు ఎక్కి దిగినా మనిషి ఆరోగ్యానికి చాలా మంచిదని తాజా పరిశోధనలో వెల్లడైంది.

ఆ ముప్పు ఉండదు
దినచర్యలో భాగంగా మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని కండరాలు సంకోచం, వ్యాకోచం చెంది రిలాక్స్ అవుతాయి. ఇది అకాల మరణ ముప్పును తగ్గిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల సాధారణ జీవితకాలం కంటే అదనంగా 14 ఏళ్లు జీవించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. రెగ్యులర్ వర్కవుట్స్ చేసేవారు లేదా క్రమం తప్పకుండా మెట్లు ఎక్కే వ్యక్తులు ఎంత ఎక్కువ కాలం జీవిస్తారో తెలుసుకోవడానికి పరిశోధకులు దాదాపు 5 లక్షల మంది వ్యక్తుల ఆరోగ్య గణాకంాలను అధ్యయనం చేశారట.

డైలీ మెయిల్ రిపోర్ట్ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కే వ్యక్తుల్లో గుండె సంబంధ వ్యాధుల కారణంగా మరణించే ప్రమాదం 39 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారిస్తుంది. వ్యక్తి జీవితకాలం అదనంగా 14 సంవత్సరాలు పెరగడానికి ఇదే ముఖ్య కారణమని నిపుణులు గుర్తించారు. రోజూ మెట్లు ఎక్కడం వల్ల మనిషికి ప్రాణాంతకం కలిగించే అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తుందని తేలింది.

శ్రమ లేకపోతే అంతే సంగతులు
ప్రస్తుత ఆధునిక యుగంలో సౌకర్యాలు పెరిగిపోయాయి. ఫలితంగా శారీరక శ్రమ లేదు. ఒకప్పుడు రోజులో కనీసం మూడు నాలుగు సార్లు మెట్లు ఎక్కే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడచూసినా ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు అందుబాటులోకి వచ్చేశాయి. ఫలితంగా మెట్లను ఎవరూ ఉపయోగించడానికి ముందుకు రావడం లేదు. ఉద్యోగాల్లో ఎక్కువగా డెస్క్ లో పని చేసేవే ఉంటున్నాయి. వీటన్నింటి కారణంగా శరీరక శ్రమ విపరీతంగా తగ్గిపోయింది. ఇది చివరికి అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతోందని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు.

మెట్లు వాడాల్సిందే
ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సోఫీ పాడాక్ ఈ అంశంపై పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ”ఎస్కలేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ మెట్లను వినియోగించుకోవాలి. మెట్లు ఎక్కడం వల్ల మనిషి ఆరోగ్యం బాగుపడుతుంది. ఎవరైనా చాలా ఎత్తయిన అంతస్తుకు వెళ్లాల్సి వస్తే శరీరం ఫిట్‌గా ఉండేందుకు కనీసం నాలుగైదు అంతస్తులు ఎక్కితే మంచిది.” అని ప్రొఫెసర్ సోఫీ పేర్కొన్నారు.

మెట్లు ఎక్కితే కలిగే ప్రయోజనాలు ఇవీ..
* మెట్లు ఎక్కడం అనేది వివిధ వ్యాయామాల కంటే బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
* బరువు తగ్గాలనుకునేవారు శరీరంలో కేలరీలను కరిగించుకోవడానికి మెట్లు ఎక్కితే మంచి ఫలితాలు చూడొచ్చు.
* జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల కంటే మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
* మెదడు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు బెటర్ అవుతుంది.
* శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి, రక్తప్రసరణ మెరుగవుతుంది.
* మెట్లు ఎక్కడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం ఫిట్‌గా తయారవుతుంది. నిద్ర నాణ్యతలో మార్పులు వస్తాయి.

ఇవీ చదవండి: Child Care: చిన్నారుల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపాలి?
Sabja Ginjalu: పరగడుపున సబ్జా గింజలతో ఇలా చేస్తే మీ ఆరోగ్యం పదిలం!
YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్
Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
Wax gourd: బూడిద గుమ్మడికాయతో మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు ఇవీ..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు