Hindu Population: భారత్ లో హిందూ జనాభా గణనీయంగా తగ్గిపోతోందట. ఇది అధ్యయనాలు చెబుతున్న మాట. అదే క్రమంలో బౌద్ధ, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల జనాభా మాత్రం పెరిగిందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో హిందూ జనాభా గణనీయంగా తగ్గినట్లు ప్రధానికి చెందిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన నివేదికలో తెలిపింది.
1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.81 శాతం పతనమైనట్లు సదరు నివేదికలో వెల్లడైంది. మనదేశంలో హిందువుల జనాభా తగ్గుతూ ఉండగా, మరోవైపు బౌద్ద, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల జనాభా మాత్రం పెరుగుదల నమోదైనట్లు తేలింది. ఇక పార్సీలు, జైనుల జనాభా సైతం హిందువులతో పాటే తగ్గుతున్నట్లు వెల్లడైంది. సమీప మిత్ర దేశాల్లో మెజారిటీ మతాల వారి జనాభా మాత్రం పెరుగుతోందని నివేదికలో పేర్కొన్నారు. ఇండియాలో మాత్రం ఆ జనాభా తగ్గినట్లు రిపోర్టులో వెల్లడించారు.
1950 సంవత్సరంలో మనదేశంలో హిందువుల జనాభా 84.68 శాతం ఉండేది. 2015 ఏడాది నాటికి అది 78.06 శాతానికి పడిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. మరో వైపు గడిచిన 65 ఏళ్ల కాలంలో ముస్లిం జనాభా మాత్రం 9.84 శాతం నుంచి 14.09 శాతానికి అమాంతం చేరుకుందని అధ్యయనంలో పేర్కొన్నారు. మయన్మార్‌లో హిందువుల జనాభా పది శాతం పడిపోయిందట. నేపాల్‌లో కూడా హిందువుల సంఖ్య 3.6 శాతం తగ్గిపోయిందని వెల్లడైంది.
ఇండియాలో మైనార్టీలకు రక్షణ బాగా పెరిగిందని, ఆ మతస్తులు భారత్ లో హాయిగా బతుకుతున్నారని స్టడీలో వెల్లడించారు. ప్రభుత్వ విధానాలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక విధానాల వల్లే మెజారిటీ జనాభా తగ్గి, మైనార్టీ జనాభా పెరిగినట్లు నివేదికలో అంచనా వేశారు. అయితే సమాజంలో భిన్నత్వాన్ని ప్రోత్సహించే రీతిలో భారత్ లో ఉన్నట్లు అధ్యయన వేత్తలు పేర్కొన్నారు.
Read also: YS Jagan in Hindupur: ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? చూశామా? హిందూపురంలో సీఎం జగన్
Hindu Temple in Abu Dhabi: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. విశేషాలు ఇవీ..
Hindu Dharmam: హిందూ మతానికి, హిందూ ధర్మానికి తేడా ఏంటి? హిందూ సనాతన ధర్మం ఏం చెబుతుంది?
Sirimanothsavam: వైభవోపేతం.. సిరిమానోత్సవం.. అంబరాన్ని తాకిన భక్తుల సంబరం
