Christina: తల్లి కావాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. చాలా మంది మహిళలు పిల్లల కోసం పరితపిస్తుంటారు. కానీ టర్కీకి చెందిన ఓ ధనవంతుడి భార్య క్రిస్టినా ఓజ్‌టుర్క్ వయస్సు కేవలం 26 ఏళ్లు.. కానీ ఆమె ఇప్పటికే అద్దె గర్భం ద్వారా 22 మంది పిల్లలకు తల్లి అయ్యింది. రష్యాలో జన్మించిన బ్లాగర్ మార్చి 2020, జూలై 2021 మధ్య తన మిలియనీర్ వ్యాపారవేత్త భర్త గాలిప్ సర్రోగేట్ ద్వారా పిల్లలను కంటూ ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, క్రిస్టినా తనకు మరింత మంది పిల్లలు కావాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ఆమె పెద్ద బిడ్డ, విక్టోరియా అనే 8 ఏళ్ల కూతురు గతంలో ఉన్న భాగస్వామితో సహజంగా పుట్టింది. ఇక క్రిస్టినాకు చిన్న పిల్లలతో కూడిన పెద్ద కుటుంబమే ఉంది క్రిస్టినా గతంలో తాను 3 అంకెలను చేరుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో క్రిస్టినా సరోగసీలకు రూ.1 కోటి 43 లక్షలు చెల్లించింది. క్రిస్టినా బేబీస్ డైరీ అనే బుక్కును కూడా రిలీజ్ చేసింది. అందులో పిల్లలను పెంచడం గురించి ప్రతిదీ ఇప్పటికే రాసింది. అయితే, ప్రతి రోజూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమమైన వాటిని మాత్రమే అందించేందుకు ఉపయోగకరమైన సమాచారం కోసం చూస్తున్నారని ఆమె వివరించింది.
Read Also: Supreme Court: పార్టీల వాగ్దానాలు నమ్మితే ఎవరేం చేస్తారు?: సుప్రీం కోర్టు ప్రశ్న
Pregnant women food: గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇలాంటి ఫుడ్స్ పుట్టబోయే బిడ్డకూ ఆరోగ్యకరం!
CM Jagan Review on Women welfare: గ్రామ స్థాయిలోనే రక్తహీనత నివారణ, పౌష్టికాహారం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Pregnant Women medicine: గర్భిణులు మెడిసిన్ తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Women Health Tips: మహిళల ఆరోగ్యానికి 5 సూత్రాలు.. ఆచరిస్తే అందమైన జీవితం!
