2024 Exit Polls: అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ ఆఖరి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత పలు సంస్థలు తాము జరిపిన ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించాయి. ఏ సంస్థ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు గెలుపొందుతారన్న అంచనాలతో నంబర్లను ప్రకటించాయి.
2024 ఎగ్జిట్ పోల్స్ అంచనా ఫలితాలు ఈసారి భిన్నంగా వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలకు సంబంధించి సస్పెన్స్‌కు తెర పడలేదు. ప్రస్తుతం టగ్ ఆఫ్ వార్ నడుస్తున్న తరుణంలో ఎగ్జిట్ ఫలితాలు కూడా అదే కంటిన్యూ చేశాయి. కొన్ని సంస్థలు అధికార వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని కుండబద్ధలు కొట్టాయి. మరికొన్ని సంస్థలు కూటమిదే అధికారమంటూ తేల్చాయి. ఈ క్రమంలో మరో రెండు రోజులు ఆగితేగానీ సస్పెన్స్‌కు తెరపడదంటున్నారు విశ్లేషకులు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
సంస్థ వైసీపీ టీడీపీ+ ఇతరులు
AARAA 94-104 71-81 0
Partha Chanakya 110-120 55-65 0
Atma Sakshi SAS 98-116 59-77 0
RACE 117-128 48-58 0
Operation Chanakya 95-102 64-68 0-5
Poll Strategy 115-125 50-60 0
Agni Veer 124-128 46-49 0
Poll Laboratory 108 67 0
Janmat Polls 95-103 67-75 0
CPS 97-108 66-78 0
వైసీపీకి అనుకూలంగా వచ్చిన ఏపీ లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్
సంస్థ టీడీపీ+ వైసీపీ
టైమ్స్ నౌ 10-12 13-15
ఆరా 10-12 13-15
ఆత్మ సాక్షి 8 17
రేస్ 6 19
టైమ్స్ నౌ ఈటీజీ 11 14
టీవీ9 ఎగ్జిట్ పోల్ 12 13
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూటమికి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇవీ..
సంస్థ టీడీపీ+ వైసీపీ ఇతరులు
రైజ్ 113-122 48-60 0-1
జనగళం 104-118 44-57 0
చాణక్య స్ట్రాటజీస్ 114-125 9-49 0-1
పయనీర్ 144 31 0
పీపుల్స్ పల్స్ 111-135 45-60 0
కేకే సర్వేస్ 161 14 0
టీడీపీ కూటమికి అనుకూలంగా వచ్చిన ఏపీ లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్
సంస్థ టీడీపీ+ వైసీపీ
ఇండియా టీవీ 19-21 3-5
రైజ్ 17-20 7-10
చాణక్య స్ట్రాటజీస్ 17-18 6-7
పయనీర్ 20 5
పీపుల్స్ పల్స్ 17-19 3-5
కేకే సర్వేస్ 25 0
ఇండియా న్యూస్ డీ డైనమిక్స్ 18 7
ఏబీపీ సీ ఓటర్ 21-25 0-4
న్యూస్ 18 19-25 5-8
సీఎన్‌ఎక్స్ 19-21 3-5
టుడేస్ చాణక్య 19-25 0-6
ఇండియా టుడే
యాక్సిస్ మై ఇండియా 21-23 2-4
ఇవీ చదవండి: Exit Polls: 2019లో ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా వచ్చాయి? ఏవి నిజమయ్యాయి?
Exit Polls: ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ హవా కొనసాగుతుందా? తెలంగాణలో పల్స్ ఎలా ఉందంటే..
Congress win in Telangana: తెలంగాణ హస్తగతం.. CONG 64, BRS 39, BJP 8, MIM 7, CPI 1
EC Alert: ఏపీలో పోలింగ్ తర్వాత హింసతో ఎన్నికల సంఘం అప్రమత్తం
