Pregnant Women medicine: గర్భిణులు ఏ మందులు వాడాలి? ఏవి వాడకూడుదు? అనేది తెలుసుకోవాలి. చాలా మంది వివిధ సందర్భాల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు రకరకాల మందులు వాడుతుంటారు. గర్భం దాల్చినప్పుడు కూడా వాటిని వాడొచ్చా? లేకపోతే ఆపేయాలా? అనే విషయాలపై అవగాహన అవసరం. ఇందుకోసం వైద్యుల్ని సంప్రదించి సరైన సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. (Pregnant Women medicine)
గర్భధారణకు ముందు నుంచే మహిళలు ప్రత్యే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే.. వైద్యుల్ని సంప్రదించాలి. వైద్యులు విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో మార్పుల ద్వారా ఊబకాయం తగ్గించుకుని, మధుమేహం వంటి వ్యాధులు ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. ఆ తర్వాతనే గర్భందాల్చాలి. గర్భం దాల్చిన తర్వత కొన్ని రకాల మందులు మామూలుగా వాడొచ్చు. అలర్జీ నివారణ మందులు కంటిన్యూ చేయవచ్చు. మొదటి మూడు నెలలు జలుబు, ఫ్లూ వంటి తగ్గించే మందుల వాడకం వల్ల పెద్దగా సమస్యలు ఉండవు.
గర్భం దాల్చిన తర్వాత మొదటి 12 వారాలు చాలా కీలకం. ఈ దశలోనే శిశువు అవయవాలు తయారు అవుతాయి. ఈ సమయంలో ఫోలిక్ యాసిడ్ తప్ప ఏ మందులూ వాడకూడదు. యాంటీ బయాటిక్స్ తీసుకోవడంలోనూ అప్రమత్తత అవసరం. వీటిలో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు ఉంటాయి. వీటిలో ఏ కేటగిరీ మందులు ఎంచుకోవడం ఉత్తమం.
మలబద్ధకానికి వాడే మందులు, ప్రాథమిక చికిత్స కోసం వాడే ఆయింట్‌మెంట్స్, క్రీములు గర్భిణులకు 100 శాతం సురక్షితం అని చెప్పలేమని వైద్యులు అంటారు. గర్భిణులు వివిధ రకాల పెయిన్స్‌కు మందుల వాడకం కంటే ఇతర థెరపీలు చేయించుకుంటే మంచిది. డాక్టర్స్ చెప్పకుండా ఎలాంటి మందులూ వాడొద్దు.
ఒకరికి ఉపయోగపడ్డ మందులు మరొకరికి ఉపయోగపడవు. ఇష్టం వచ్చినట్టు కొనుక్కొని వాడుకోకూడదు. డాక్టర్లు రాస్తేనే వాడుకోవాలి. కొన్ని రకల మందులు వాడినప్పుడు ఆ మందుల ప్రభావం శరీరం నుంచి క్లియర్ అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం కనీసం 3 నెలల ముందు నుంచే ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి.
గర్భిణులకు మొదటి 12 వారాల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఫిట్స్, షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నా… ఫిజీషియన్, గైనకాలజిస్ట్ ఇద్దరి సలహాలు పాటిస్తూనే మందులు వాడాలి. వైద్యుల సలహా లేకుండా ఎటువంటి మందులు వాడకూడదు. గర్భిణులకు 3 నెలల తర్వాత వైద్యులు ఐరన్, క్యాల్షియం, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. కొన్ని మెడికేటెట్ ప్రోటీన్ పౌడర్స్ కూడా సూచిస్తారు.