CM Jagan Review on Women welfare: గ్రామ స్థాయిలోనే రక్తహీనత నివారణ, పౌష్టికాహారం.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

CM Jagan Review on Women welfare: ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తిస్తున్నారని, అలాంటి వారందరికీ పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యత ఆరోగ్య శాఖ తీసుకుంటుందన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం సీఎం జగన్‌ ఏమన్నారంటే.. (CM Jagan Review on Women welfare)

* జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో గుర్తించిన బాధితులకు పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలి.
* ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ మధ్య సమన్వయం ఉండాలి.
* దీనివల్ల గ్రామస్థాయిలో పూర్తిస్థాయిలో రక్తహీనతను నివారించగలుగుతాం.
* ఇచ్చిన పౌష్టికాహారాన్ని వారు తీసుకుంటున్నారా? లేదా? రక్తహీనత సమస్య తగ్గుతుందా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి.

అత్యంత నిశితంగా పర్యవేక్షణ
* సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలి.
* అంగన్‌వాడీలలో సూపర్‌ వైజరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్నదానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. బలమైన ఎస్‌ఓపీని రూపొందించాలి.
* డ్రై రేషన్‌ పంపిణీ పైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. రేషణ్‌ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదు.
* ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

టీకాలపై పర్యవేక్షణ
* సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందిస్తున్న సమయంలోనే గర్భిణులు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలి.
* ఒకవేళ టీకాలు మిస్‌ అయితే వెంటనే వేయించేలా చర్యలు తీసుకోవాలి.
* ఈ మేరకు సంబంధిత గ్రామానికి చెందిన ఏఎన్‌ఎంను ఆ సమయంలో అక్కడే ఉండేలా చూడాలి.
* పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? అన్నదానిపై కూడా అక్కడే పరిశీలన చేయాలి.

* ఎవరైనా పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉంటే వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి.
ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు అయ్యేలా చూడాలి.
* రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించిన వెంటనే, ఆ వివరాలు తీసుకుని మహిళా శిశుసంక్షేమ ద్వారా వారికి పౌష్టికాహారం అందేలా చూడాలి.
* ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలి.

హిమోగ్లోబిన్‌ టెస్టులు చేయాలి
* ప్రతినెలా కూడా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయాలి.
* జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాలపై క్యాంపులు నిర్వహించేలా చూడాలి.
* ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలి.

Read Also : Jagananna Chedodu: రేపే అకౌంట్లలోకి రూ.10 వేలు.. జగనన్న చేదోడు నిధుల జమ

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles