ఆదివారం, 20 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
National

Supreme Court: పార్టీల వాగ్దానాలు నమ్మితే ఎవరేం చేస్తారు?: సుప్రీం కోర్టు ప్రశ్న

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 28 మే 2024

Supreme Court: ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తుంటాయి. అయితే, అలవిగాని హామీలివ్వడం మనదేశంలో చాలా పార్టీలకు అలవాటే. అధికారం చేపట్టే వరకు హామీలు గుప్పించడం, గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించడం మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ పార్టీల హామీలు నమ్మి జనం ఓట్లు వేస్తుంటారు. అయితే, అలాంటి వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకపోవడం మన రాజ్యాంగం ప్రకారం ఎలా ప్రశ్నించాలి? ఇది అవినీతి కిందకు రాదా? అంటూ సుప్రీంకోర్టులో ఇటీవల పిల్ దాఖలైంది.

ఈ పిల్ పై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలు అవినీతి కిందకు రావంటూ తేల్చి చెప్పింది సుప్రీం ధర్మాసనం. అంతేకాదు.. హామీలు ఇవ్వడమే అవినీతిక కిందకు వస్తుందనడం సబబు కాదని పేర్కొంది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలను నమ్ముతారని, అలాంటి సందర్భాల్లో ఎవరేం చేయగలరంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పిల్ విచారణకు ధర్మాసనం ఈ సందర్భంగా అంగీకారం తెలపలేదు.

దీన్ని బట్టి చూస్తే… ఎన్నికల్లో పార్టీల అధినేతలు ఇచ్చే వాగ్దానాలను ప్రజలు గుడ్డిగా నమ్మేసి వారికి ఓట్లు వేస్తున్నారని, విచక్షణతో ఆలోచించి ప్రజలే తగిన నిర్ణయం తీసుకోవాలంటూ అత్యున్నత ధర్మాసనం సూచించినట్లయింది.

Read Also: Supreme Court: వివాహేతర బంధం నిర్ధారణకు కాల్‌ రికార్డులు తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు ఏమందంటే..
Marriage: మీకు తెలుసా? అక్కడ ప్రతి వ్యక్తీ ఇద్దరిని మనువాడాలట!
Court Cases Pending: దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్‌.. నేషనల్‌ జ్యుడీషిల్‌ డేటాలో కీలక అంశాలు..
SBI Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బీఐ.. మొత్తం ఎన్ని బాండ్లు అంటే?
SC On Divorce : ఆరు నెలలు కూడా అక్కర్లేదు.. విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ట్యాగ్స్: , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading