HomeInternationalIndian Students in US: అగ్రరాజ్యంలో ఉన్న మన విద్యార్థులు 2,69,000 మంది

Indian Students in US: అగ్రరాజ్యంలో ఉన్న మన విద్యార్థులు 2,69,000 మంది

Indian Students in US: ఉన్నత చదువుల చదవాలని చాలా మంది కోరుకుంటారు. పెద్ద చదువుల కోసం ఇతరదేశాలకూ కొందరు వెళ్తుంటారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా విదేశాల్లో చదవాల్సిందేనని కొందరు భావిస్తుంటారు. ఈ క్రమంలో ఏటా లక్షలాది మంది యువత విదేశాల బాట పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది తొలి ప్రాధాన్యంగా అగ్రరాజ్యం అమెరికానే ఎంచుకుంటున్నారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

అమెరికాలో అడుగుపెడుతున్న వారి సంఖ్య దశాబ్ద కాలంలో 8 రెట్లు పెరిగినట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేవలం 2022-23 విద్యా సంవత్సరంలోనే వీరి సంఖ్య 35 శాతం పెరిగింది. మరే దేశం కూడా భారతీయ విద్యార్థులను ఈ స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు.

ప్రవేశం చాలా ఈజీ
ఇండియాలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించడం కంటే అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ప్రవేశం పొందడం సులువుగా మారింది. ఇక్కడి విద్యాసంస్థల్లో ప్రవేశాల ఆమోదం రేటు 0.2 శాతంగా ఉండగా.. అమెరికాలో పేరుగాంచిన హార్వర్డ్‌ యూనివర్సిటీ (3 శాతం), మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీల్లోనే (4 శాతం) అధికంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. సైన్స్‌, మ్యాథ్స్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో చాలా మంది ఉన్నత విద్యను చదువుతున్నారు. యూజీ ప్రోగ్రామ్‌ల వైపు భారత మధ్యతరగతి యువత ఆసక్తి చూపిస్తోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

చైనాను దాటేస్తున్నాం..
15 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరిలో కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ దేశాల వైపు ఎక్కువగా చూస్తున్నప్పటికీ అమెరికాతో పోల్చితే తక్కువే. ఒక్క అమెరికాలోనే ప్రస్తుతం 2,69,000 మంది భారతీయ స్టూడెంట్స్ విద్యనభ్యసిస్తున్నారు. కేవలం 2022-23 విద్యా సంవత్సరంలోనే ఈ సంఖ్య 35 శాతానికిపైగా పెరగడం విశేషం.

అమెరికా యూనివర్సిటీల్లో ఇప్పటివరకు చైనా విద్యార్థులే ఎక్కువ శాతం ఉన్నారు. అయితే తాజాగా ఇండిచా ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా వెళ్తోంది. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌, డల్లాస్‌లలో చైనా విద్యార్థుల సంఖ్య 1,200 నుంచి 400లకు పడిపోయింది. భారతీయ విద్యార్థుల సంఖ్య మాత్రం 3,000 నుంచి 4,400కు జంప్‌ అవడం ఈ సంకేతాలను నిజం చేసేలా ఉంది.

అంతర్జాతీయ విద్యార్థుల తాకిడి నేపథ్యంలో భారీగా ట్యూషన్‌ ఫీజులు వసూలు చేసే అమెరికా కాలేజీలకు ఆర్థికంగా పెద్ద వనరుగా మారుతోంది. దీంతో ఇండియాలోని టైర్‌ 2, టైర్‌ 3 పట్టణాలపై అమెరికా విద్యాసంస్థలు దృష్టి పెడుతున్నాయి. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు చేరువయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ కార్యక్రమాల ద్వారా ఇండియాతో బంధాలను మెరుగుపరుచుకునేలా కసరత్తు చేస్తున్నాయి.

ఇవీ చదవండి: Folding House: ధర రూ.21 లక్షలు.. అమెరికాలో ట్రెండింగ్‌లో ఉన్న మడత పెట్టే ఇళ్ల అమ్మకం
American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు
G20 Summit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ సమావేశం
Chandrababu Naidu: ప్రతి ఇంటి నుంచి అమెరికా వెళ్లారంటే అది మావల్లే: చంద్రబాబు
Kancha Ilaiah: ఏపీలో చదువుల విప్లవం మరో ఐదేళ్లు కొనసాగాలి.. జగన్‌ రాజకీయాలను మార్చేశారు: కంచ ఐలయ్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు