G20 Summit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ద్వెపాక్షిక అంశాల పై ఇరుదేశాల నేతలు చర్చలు జరిపారు. హై టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధం పై చర్చ కొనసాగినట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పై కూడా చర్చించినట్లు తెలిసింది. మోదీ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందాల పురోగతి పై చర్చ జరిగినట్లు సమాచారం.
రేపు, ఎల్లుండి జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సు
జీ20 సదస్సు కోసం సర్వాంగసుందరంగా ఢిల్లీ ముస్తాబైంది. రేపు, ఎల్లుండి జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత మండపంలో అట్టహాసంగా వేడుక సాగనుంది. ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత మండపంలో సౌండ్ అండ్ ఫౌంటెన్ షో ఉంటుంది.
అమెరికా, భారత్ మధ్య పలు అంశాలపై ఒప్పందాలు
అమెరికా నేషనల్ సైన్స్, ఫౌండేషన్ , భారత్ బయో టెక్నాలజీ విభాగం మధ్య ఒప్పందం కుదిరింది. బయోటెక్నాలజీ , బయో మ్యాను ఫ్యాక్టరింగ్ ఆవిష్కరణల్లో సహకారానికి ఒప్పందం చేసుకున్నారు. శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో కలిసి పనిచేసేందుకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. సెమీ కండక్టర్ల పరిశోధన, భవిష్యత్తు తరాల కమ్యూనికేషన్ వ్యవస్థపై సహకారం ఇచ్చిపుచ్చుకోనున్నారు. సైబర్ సెక్యూరిటీ, రవాణా వ్యవస్థ, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం ఉంటుంది.
జీ- 20 శిఖరాగ్ర సదస్సు తొలిరోజు షెడ్యూల్
* ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య భారత మండపానికి దేశాధినేతల రాక
* లెవల్ – 2 లో ‘ట్రీ అఫ్ లైఫ్ ఫోయర్ ‘దగ్గర దేశాధినేతల ఫోటో సెషన్
* లీడర్స్ లాంజ్ లో దేశాధినేతల కలయిక
* ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య సమ్మిట్ హాల్ లో ఒకే భూమి అంశం పై చర్చ
* చర్చల తర్వాత మధ్యాహ్న భోజన విరామం
* మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు లెవల్
* 1 లో ద్వైపాక్షిక చర్చలు
* మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఒకే కుటుంబం అంశం పై చర్చ
* తర్వాత వారికి కేటాయించిన హోటళ్లకు తిరుగుముఖం
* రాత్రి 7-8 గంటల మధ్య విందు
* విందుకు దేశాధినేతల ఆగమనం, ఫోటో సెషన్
* రాత్రి 8- 9.15 గంటల వరకు విందు భోజనం చర్చ
* రాత్రి 9.10 నుంచి 9.45 గంటల వరకు ఒకే చోట చేరనున్న అధినేతలు, ప్రతినిధులు
జీ20 సదస్సు నిర్వహణ భారత్ ఘన విజయం : రిషి సునాక్
జీ20 సదస్సు నిర్వహణ భారత్ ఘన విజయం అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తెలిపారు. భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. హిందువుగా గర్విస్తున్నానని రిషి పేర్కొన్నారు. జీ20 సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. భారత్ తో కీలక వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు.
Read Also : Modi on G20: జీ-20 సమావేశాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు