Election Day: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో ఉన్నఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఈవో ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు జీఓఆర్టీ నంబర్ 845, తేదీ 04.05.2024 ను జారీ చేసినట్లు ఎన్నికల కమిషనర్ కార్యాలయం తెలిపింది.
ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ సెలవును మంజూరు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెక్రటేరియట్ విభాగాలు/విభాగాల అధిపతి/జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
స్వేఛ్చాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఓటరూ వోటుహక్కు తప్పక వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమును ఆయన సందర్శించారు. వివిధ విభాగాల ద్వారా ఎన్నికల ప్రక్రియకు అనుసరిస్తున్న విధానాలను గుర్చి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి సిఈవోకు వివరించారు.
చెక్ పోస్ట్ లవద్ద నిఘా, జి.పి.ఎస్. వాహన ట్రౌకింగ్, వెబ్ కాస్టింగ్, ఫ్లెయింగ్ స్క్వాడ్, ఫిర్యాదుల విభాగం, హోమ్ ఓటింగ్ విధానాల గురించి వివరించారు. వివిధ విభాగాల నోడల్ అధికారులను పరిచయం చేశారు. ముందుగా ఎం.సి.ఎం.సి. రుములో ఏర్పాటు చేసిన న్యూస్ వాచింగ్, కంప్లెంట్స్ విభాగంలో నిర్వహిస్తున్న పనులను నోడల్ అధికారి జి.వి.లక్ష్మి వివరించారు.
ప్రకటనలు, సర్టిఫికెట్స్ మంజూరు, వివిధ టి.వి. ఛానళ్లు, సోషల్ మీడియాలలో వస్తున్న స్క్రోలింగ్ప్, వెంటనే చేపడుతున్న చర్యలను గురించి వివరించారు. వివిధ వార్తా పత్రికలలో వచ్చే పెయిడ్ న్యూసుపై తీసుకుంటున్న చర్యలను చెప్పారు. అనంతరం సీఈవో తాళ్లపాలెం, బయ్యవరం గ్రామాల్లో జరుగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. స్ట్రాంగ్ రూములు ఆర్.ఓ. రూమ్ కౌంటింగ్ రూముల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఇవీ చదవండి: SAMARTH APP: క్విక్ పోలీసింగ్ కోసం సమర్థ్ మొబైల్ యాప్ తీసుకొచ్చిన ఈసీ
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు: ఈసీ కీలక సూచనలు
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ
YS Jagan Assets: ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్ ఆస్తుల వివరాలు
