YS Jagan in Repalle: మరో వారం రోజుల్లో జరగబోతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్నవి కావని, వచ్చే ఐదేళ్ల పేదల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఆయన ఇవాళ బాపట్ల జిల్లా రేపల్లెలో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం ఏమన్నారంటే..
* మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం
* ఈ ఎన్నికలు….ఐదేళ్ల భవిష్యత్
* జగన్ కు ఓటేస్తే…పథకాలు కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి
* పొరపాటున బాబుకు ఓటేస్తే…పథకాలు ముగింపే
* చంద్రబాబును నమ్మడమంటే మళ్లీ మోసపోవడమే
* బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే
* చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది
* 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
* రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం
* ఎలాంటి లంఛాలు, వివక్ష లేకుండా నేరుగా అందించాం
* మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం
* నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో రూపురేఖలు మార్చాం
* ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం
* ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన
* విద్యార్థులకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, బైజూస్ కంటెంట్
* అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా సాయం
* అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత
* అక్కాచెల్లెమ్మల కోసం కాపునేస్తం, ఈబీసీ నేస్తం
* అక్కాచెల్లెమ్మల పేరు పై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం
* అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ.3 వేల పెన్షన్
* ఇంటి వద్దకే పౌర సేవలు రావడం ఏనాడైనా చూశారా?
* రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
* సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నాం
* విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం
* పేదవాడి వైద్యం కోసం రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం
* పేషెంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం
* ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం
* మత్స్యకార భరోసా, లా నేస్తం, వాహనమిత్ర పథకాల ద్వారా సాయం
* గ్రామ సచివాలయ ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం
* జగన్ అనే మీ అన్న, మీ రైతు, మీ బిడ్డ రాష్ట్రంలో వేసిన విత్తనాలు మరో 15 ఏళ్లలో వృక్షాలు అవుతాయి
* ప్రతి గ్రామంలో సంక్షేమం, మంచి మొక్కలు నాటాం
* పేదరికాన్ని మటుమాయం చేయాలనేది మీ బిడ్డ స్వప్నం
* చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?
* 2014లో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో ఏమైంది?
* చంద్రబాబు ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్కటైనా నెరవేర్చారా?
* రైతు రుణమాఫీ చేస్తానన్నాడు…చేశాడా?
* పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు….చేశాడా?
* ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు…చేశాడా?
* ఇంటింటికీ జాబు అన్నాడు…లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు….ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చాడా?
* పేదలకు 3 సెంట్ల స్థలం అన్నాడు…సెంటు స్థలమైనా ఇచ్చాడా?
* రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత రుణమాఫీ అన్నాడు
* ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు…చేశాడా?
ఇవీ చదవండి: CM Jagan on Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రతిపక్షాల దుష్ప్రచారం.. సీఎం జగన్ వివరణ ఇదీ!
YS Jagan in Hindupur: ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? చూశామా? హిందూపురంలో సీఎం జగన్
YS Jagan in Palamaneru: 2014లో ఇంటింటికీ పంపిన పాంప్లెట్‌లో ఒక్కటైనా నెరవేర్చారా? పలమనేరులో సీఎం జగన్
YS Jagan in Nellore: 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా.. ఇలా చంద్రబాబు చెప్పగలడా? నెల్లూరులో సీఎం జగన్
