HomeLife StyleHeart care: గుండెను భద్రంగా కాపాడుకుందాం.. ఎలాంటి వ్యాయామాలు చేయాలంటే..

Heart care: గుండెను భద్రంగా కాపాడుకుందాం.. ఎలాంటి వ్యాయామాలు చేయాలంటే..

Heart care: ప్రస్తుత సమాజంలో గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ప్రతి రోజూ గుండె పోటు మరణాలు వార్తల్లో చూస్తున్నాం. పాతికేళ్లు కూడా నిండని వారు కూడా గుండెపోటుకు గురి కావడం ఆశ్చర్యం కలిగించే అంశం. గుండె సంబంధ సమస్యలపై ముందే అప్రమత్తమైతే ప్రాణాపాయ ముప్పును నివారించవచ్చు. మనదేశంలో పెరుగుతున్న హృద్రోగ మరణాలు ఇప్పుడు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? రోజూ ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది? ఈ కథనంలో తెలుసుకుందాం.

మన జీవనశైలిలో మారుతున్న అలవాట్లు, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధ సమస్యలు అధికమవుతున్నాయి. గణాంకాలు పరిశీలిస్తే శీతాకాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతీయుల్లో ఎక్కువగా హార్ట్‌ అటాక్ రావడానికి ప్రధాన కారణాల్లో వ్యాయామం చేయకపోవడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. భారతీయులు వ్యాయామానికి సమయం కేటాయించని కారణంగానే హార్ట్‌ అటాక్ సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

సూర్య నమస్కారాలు చేయాలి
ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ తప్పనిసరిగా వాకింగ్‌ చేయాలంటున్నారు. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం ద్వారా గుండె సంబంధ ప్రాబ్లమ్స్‌ రాకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు. సూర్య నమస్కారాలు ప్రతి రోజూ చేయాలని నిపుణులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలు 12 రకాల వ్యాయామాలతో కూడిన యోగా ఆసనం. ఉదయాన్నే ఎండలో ఈ యోగాసనాలు వేయడం ద్వారా గుండె, ఊపిరితిత్తులను బలంగా తయారు చేస్తాయి.

సైక్లింగ్‌ చేసినా గుండె జబ్బులు రావు
రోజూ తప్పకుండా 30 నుంచి 40 నిమిషాలు కాస్త వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా నడిచినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె కండరాలను బలంగా తయారయ్యేలా చేస్తుంది. అలాగే రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యాన్ని పెరిగేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. సైకిలింగ్ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. వారంలో కనీసం 4-5 రోజులు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే, అది మన గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బాగు చేస్తుందని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: ECG changes: ఈసీజీలో మార్పులు గుండె జబ్బులకు సంకేతమా? ఎలాంటి జగ్రత్తలు తీసుకోవాలి?
Heart Attack: గుండె పోటు వస్తుందనే ముందు ఈ లక్షణం కనిపిస్తుంది.. జాగ్రత్త చర్యలివే..
YS Jagan in Pulivendula: బంధువులకు దోచిపెట్టడానికి సీఎం కాలేదు.. సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు!
Hand Transplantation: హ్యాండ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన వ్యక్తి ఇప్పుడెలా ఉన్నాడు?
Millet Milk: చిరుధాన్యాలతోనూ మిల్లెట్‌ మిల్క్‌.. ఇలా తయారు చేసుకోండి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు