ECG changes: చాలామందిలోనూ ఈసీజీలో కనిపించే మార్పాలు గుండె జబ్బులకు కారణం కాదని వైద్య నిపుణుల అభిప్రాయం. ఈసీజీ నార్మల్ ఉన్నంత మాత్రాన గుండె జబ్బు లేదని అనుకోవడానికి కూడా వీల్లేదు. మరి ఏం చేయాలి..? ఎవరికి వారు పరీక్షలు చేయించుకుని, అనవసర ఆందోళన చెందకూడదు. వైద్యుల్ని సంప్రదించి, వాళ్లు సూచించిన పరీక్షలు చేయించుకుంటేనే సరైన వ్యాధి ఉందో లేదో చెప్పే వీలు కలుగుతుంది. (ECG changes)
గుండె పనితీరును తెలుసుకునేందుకు చేసే పరీక్షల్లో ఈసీజీ ఒకటి. ఈసీజీలో వచ్చిన ఫలితం ఆధారంగా వైద్యులు ఒక అంచనాకు వస్తారు. గుండె జబ్బు ఉందో లేదో నిర్ధారిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈసీజీలో స్వల్ప మార్పులు ఉన్నం మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎవరికైనా గుండె జబ్బు ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరికొందరికి ఒకసారి, రెండు సార్లు గుండె పోటు వచ్చినా, శస్త్ర చికిత్స జరిగినా ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. అటాక్ వచ్చినంత మాత్రాన సదరు వ్యక్తి ఫిట్ కాదని భావించకుడదు. గుండె కండరాలపై అటాక్ ఏ మేరకు ప్రభావం చూపించింది అనేది చాలా ముఖ్యం.
షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నడిస్తే ఆయాసం వచ్చినా ఇతర ఇబ్బందులు అనిపించినా తరచుగా వైద్యుల్ని సంప్రదించాలి. రెగ్యులర్ చికిత్సల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.
సాధారణంగా గుండె జబ్బు ఉందో లేదో చెప్పేందుకు ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్ మిల్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్షల్లో చాలా అంశాల్ని పరిగణలోకి తీసుకుని, నిపుణులు మాత్రమే ఓ అంచనాకు రాగలుగుతారు. అంతేతప్ప సొంతంగా పరీక్షలు చేయించుకుని, ఎలాంటి కంక్లూజన్‌కు రావొద్దని వైద్యులు చెబుతున్నారు.
Read Also : Weight Loss best tips: బరువు తగ్గడం ఎలా? అద్భుత చిట్కాలు.. ఏ ఆహారం తీసుకోవాలంటే..