Cow milk: రోజూ ఓ గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. పౌష్టికాహారం కింద తాగే పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు తాగడం వల్ల ఒంట్లో బరువు కూడ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, ఆవు పాలు మంచిదా, గేదెపాలు మంచిదా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఏ పాలు తాగితే బరువు నియంత్రణలో ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
రోజూ ఉదయం చాలా మంది టీ తాగుతుంటారు. మరికొందరు కాఫీ తాగుతారు. పిల్లలైతే పాలు తాగుతుంటారు. పాలు తాగడం అనేది మంచి అలవాటు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యం కోసం రోజూ గ్లాసుడు పాలు తాగితే మంచిది. పాలు తాగడం వల్ల ఎముకులు, దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. పాలలో క్యాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా దొరుకుతాయి. రోజూ గ్లాసు పాలు తీసుకోవడం వల్ల మెదడు పనితీరులో చురుకుదనం ఏర్పడుతుంది. శక్తి పెరుగుతుంది. అయితే, కొంతమంది బరువు తగ్గడానికి, నియంత్రణలో ఉంచుకోవడానికి పాలు తాగుతుంటారు.
ఆవు పాలు, గేదెపాలు అందరూ తాగడం మనం గమనిస్తుంటారు. ఈ పాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. అందువల్ల ఏ పాలు తాగుతున్నారో ముందుగా తెలుసుకోవాలి. పాలు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పాలు తాగడం వల్ల ఆకలి అనే అనుభూతి తగ్గుతుంది. పెఫైడ్ వైవై హర్మోన్ ఉండటం వల్ల ఎక్కువ సేపు సంతృప్తి ఉంటుంది. పాలలో క్యాల్షియం సంపూర్ణంగా ఉండటం వల్ల జీవక్రియ మెరుగు అవుతుంది.
వ్యత్యాసం ఇదీ..
ఆవు, గేదె పాల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఎక్కువ మంది పిల్లలకు ఆవు పాలు పడుతుంటారు. కాస్త పెద్దవారు అయ్యాక గేదె పాలు తాపిస్తుంటారు. దీనికి కారణం ఆవు పాలలో తక్కువ కంటెంట్ కొవ్వు కలిగి ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతాయి. ఆవు పాలతో పోల్చితే గేదె పాలు కాస్త చిక్కగా కనిపిస్తాయి. ప్రొటీన్ కంటెంట్ విషయానికి వస్తే ఆవు పాలు కంటే గేదె పాలలో ఎక్కువ ప్రోటీన్లు లభిస్తాయి. అయితే గేదె పాలతో పోలిస్తే ఆవు పాలలో నీటి శాతం ఎక్కువ. అందుకే ఆవు పాలు పల్చగా ఉంటాయి. అందువల్ల ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకు ఆవు పాలు పడుతుంటారు. గ్లాసుడు గేదె పాలలో 100 కేలరీలు ఉంటాయి. అదే గ్లాసుడు ఆవు పాలలో 65 నుంచి 70 కేలరీలే ఉంటాయి. ఇవి కాకుండా ఆవు పాలలో సల్ఫర్ లభిస్తుంది. ఇది మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. దీని నుంచి విటమిన్ ఎ ఉత్పత్తి కూడా అవుతుంది. బీటా కెరోటిన్ గేదె పాలలో ఉండదు.
ఏ పాలు బెటరంటే..
ఆవు పాల కంటే గేదె పాలలో పోషకాలు, కేలరీల పరిణామం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆవు పాలలో తక్కువ కొవ్వు ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కువ హైడ్రేటింగ్, పల్చగా ఉంటాయి. గేదె పాలలో కొవ్వు అధికంగా ఉంటుంది. 100 మిల్లీలీటర్ల గేదె పాలలో 8 గ్రాముల కొవ్వు ఉంటే, 100 మిల్లీలీటర్ల ఆవు పాలలో కేవలం 4 గ్రాముల కొవ్వే ఉంటుంది. పూర్తి కొవ్వు పాలు తీసుకోవడం తక్కువ శరీర బరువుతో ముడిపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొంతమంది పాలు తాగడం వల్ల సాధారణంగా బరువు పెరగడాన్ని అరికడుతుందని అనేక అధ్యయనాలు సైతం వెల్లడించాయి.
ఇవీ చదవండి: Lose belly fat: కొవ్వును కరిగించేందుకు ఆపసోపాలు పడుతున్నారా? ఈ టిప్స్ పాటించండి
CM Jagan review on cooperation: అగ్రి కార్యకలాపాలు, మహిళల స్వయం ఉపాధికి తక్కువ వడ్డీకే రుణాలు: సమీక్షలో సీఎం జగన్
Vyooham Teaser: అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు.. ‘వ్యూహం’ టీజర్‌తో అంచనాలు పెంచేసిన రామ్‌గోపాల్ వర్మ!
